Ravichandran Ashwin 6 Can Break 6 Records In Kanpur Test: బంగ్లాదేశ్‌తో రెండు టెస్ట్‌ల సిరీస్‌లో భారత్ శుభారంభం చేసింది. చెన్నైలో జరిగిన మొదటి టెస్టులో ఘన విజయం సాధించిన రోహిత్ సేన.. మరో కీలక పోరుకు సిద్దమైంది. శుక్రవారం నుంచి కాన్పూర్ వేదికగా రెండో టెస్ట్ ప్రారంభం కానుంది. కాన్పూర్ టెస్ట్‌లోనూ గెలిచి.. సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. చెన్నైలో చెలరేగిన వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. కాన్పూర్‌లోనూ సత్తాచాటాలని చూస్తున్నాడు. బంగ్లాదేశ్‌తో రెండో టెస్టు ముంగిట అశ్విన్‌ను ఎన్నో రికార్డులు ఊరిస్తున్నాయి.
అశ్విన్‌ను ఊరిస్తున్న రికార్డులు ఇవే:
1) టెస్టు ఛాంపియన్‌షిప్ 2023-25లో అత్యధిక వికెట్స్ తీసిన బౌలర్‌గా జోష్ హేజిల్‌వుడ్ (48) ఉన్నాడు. అశ్విన్ మరో నాలుగు వికెట్లు తీస్తే.. హేజిల్‌వుడ్‌ను అధిగమిస్తాడు.
2) కాన్పూర్ టెస్టులో అశ్విన్ 8 వికెట్లు తీస్తే ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ చరిత్రలో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా నిలుస్తాడు. నాథన్ లైయన్ 187 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు.
3) రెండో టెస్టులోని ఓ ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు పడగొడితే.. అత్యధికసార్లు అయిదు వికెట్ల ఘనత సాధించిన రెండో బౌలర్‌గా అశ్విన్ నిలుస్తాడు. ఈ జాబితాలో ముత్తయ్య మురళీధరన్ (67) అగ్రస్థానంలో ఉన్నాడు. షేన్ వార్న్ (37)తో యాష్ సమానంగా ఉన్నాడు.
4) భారత్ తరఫున నాలుగో ఇన్నింగ్స్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఆర్ అశ్విన్ ఇప్పటికే రికార్డు సృష్టించాడు. మరో వికెట్ తీస్తే.. వంద వికెట్ల మైలురాయిని అందుకుంటాడు.
5) బంగ్లాదేశ్‌పై భారత్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా జహీర్ ఖాన్ (31) ఉన్నాడు. అశ్విన్ మరో మూడు వికెట్లు తీస్తే.. జహీర్‌ను అధిగమిస్తాడు.
6) కాన్పూర్ టెస్టులో 9 వికెట్లు తీస్తే.. టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యధిక వికెట్లు పడగొట్టిన ఏడో బౌలర్‌గా అశ్విన్ రికార్డులో నిలుస్తాడు. ఈ క్రమంలో నాథన్ లైయన్ (520)ను యాష్ వెనక్కి నెడుతాడు.