NTV Telugu Site icon

Kanpur Test: భారత్-బంగ్లాదేశ్‌ రెండో టెస్టు.. నాలుగో రోజు ఆటలో మార్పులు!

India Test Team

India Test Team

Kanpur Test Session Timings: కాన్పూర్ వేదికగా భారత్, బంగ్లాదేశ్‌ రెండో టెస్టు ఎట్టకేలకు ప్రారంభం అయింది. నాలుగో రోజు ఆట కొనసాగుతోంది. వర్షం కారణంగా తొలి రోజు 35 ఓవర్లు మాత్రమే సాధ్యం కాగా.. రెండు, మూడు రోజుల్లో ఒక్క బంతి కూడా పడలేదు. మూడోరోజైన ఆదివారం వర్షం లేకున్నా ఔట్‌ ఫీల్డ్‌ చిత్తడిగా ఉన్న కారణంగా ఆట రద్దయింది. తొలి మూడు రోజుల్లో 35 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. వరణుడు శాంతించడంతో నాలుగో రోజైన సోమవారం ఆట మొదలైంది.

నాలుగో రోజు ఆటలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. నేడు 98 ఓవర్ల పాటు ఆట కొనసాగనుంది. దాంతో టెస్ట్ సెషన్ల టైమింగ్స్‌లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఉదయం 9.30 గంటల నుంచి 11.45 వరకు తొలి సెషన్ జరగనుంది. 40 నిముషాలు లంచ్ బ్రేక్ ఉంటుంది. మధ్యాహ్నం 12.25 నుంచి 2.40 వరకు రెండో సెషన్ జరుగుతుంది. 20 నిమిషాల టీ బ్రేక్ అనంతరం.. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మూడవ సెషన్ ఉంటుంది.

Also Read: Gold Rate Today: మగువలకు శుభవార్త.. నేడు తులం ఎంతుందంటే?

ప్రస్తుతం బంగ్లాదేశ్ 57 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది. మోమినుల్ హక్ (76), మెహిదీ హసన్ మిరాజ్ (4) క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో ఆకాశ్ దీప్ రెండు, ఆర్ అశ్విన్ రెండు వికెట్స్ తీశారు. బుమ్రా, సిరాజ్ తలో వికెట్ పడగొట్టారు.