NTV Telugu Site icon

IND vs BAN: పెవిలియన్‌కు భారత బ్యాటర్లు.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ యువ పేసర్!

Hasan Mahmud

Hasan Mahmud

Hasan Mahmud Record Against India: చెన్నైలో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్‌ టాప్‌ ఆర్డర్‌ కుప్పకూలింది. బంగ్లా యువ బౌలర్ హసన్ మహ్మద్ దెబ్బకు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ తక్కువ పరుగులకే పెవిలియన్‌కు చేరారు. 9.2 ఓవర్లలో 34 పరుగులకే టీమిండియా మూడు కీలక వికెట్స్ కోల్పోయింది. పది ఓవర్లలోపే ముగ్గురు భారత స్టార్ బ్యాటర్లు పెవిలియన్‌కు పంపిన హసన్ మహ్మద్.. అరుదైన ఘనతను ఖాతాలో వేసుకున్నాడు.

17 ఏళ్ల తర్వాత ముగ్గురు భారత బ్యాటర్లు లేదా అంతకంటే ఎక్కువ మందిని తొలి ఇన్నింగ్స్‌లో 10 ఓవర్లలోపు పెవిలియన్‌కు చేర్చిన బౌలర్‌గా హసన్ మహ్మద్ రికార్డుల్లో నిలిచాడు. అంతకుముందు ఈ ఘనతను శ్రీలంక పేసర్ చనక వెల్గెదర పేరిట ఉంది. 2009లో అహ్మదాబాద్ వేదికగా జరిగిన టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో గౌతమ్ గంభీర్, వీరేంద్ర సెహ్వాగ్, సచిన్ టెండూల్కర్‌ను అతడు 10 ఓవర్ల లోపు అవుట్ చేశాడు.

Also Read: Amazon Great Indian Festival: స్మార్ట్‌ఫోన్‌ల డీల్స్‌ను రివీల్ చేసిన అమెజాన్‌.. ఇలాంటి ఆఫర్స్ మళ్లీ రావు!

బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్‌ తడబడుతోంది. 43 ఓవర్లకు 6 వికెట్స్ కోల్పోయిన భారత్ 145 రన్స్ చేసింది. క్రీజులో రవీంద్ర జడేజా, ఆర్ అశ్విన్ ఉన్నారు. యశస్వి జైస్వాల్ హాఫ్ సెంచరీ (56), రిషబ్ పంత్ (39) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కేఎల్ రాహుల్ (16) విఫలమయ్యాడు. హసన్ మహ్మద్ నాలుగు వికెట్స్ పడగొట్టాడు.