NTV Telugu Site icon

IND vs BAN: భారత్-బంగ్లా షెడ్యూల్‌లో మార్పు.. 14 ఏళ్ల తర్వాత అక్కడ అంతర్జాతీయ మ్యాచ్!

Gwalior Cricket Stadium

Gwalior Cricket Stadium

IND vs BAN 1st T20I shifted from Dharamsala to Gwalior: బంగ్లాదేశ్, ఇంగ్లండ్‌లతో జరగబోయే స్వదేశీ సిరీస్‌ల షెడ్యూల్‌లో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మంగళవారం మార్పులు చేసింది. కొత్త షెడ్యూల్ ప్రకారం.. బంగ్లాదేశ్‌తో ఓ టీ20, ఇంగ్లండ్‌తో రెండు టీ20 మ్యాచ్‌ల వేదికలు మారాయి. బంగ్లాదేశ్‌తో త్వరలో జరగబోయే టీ20 సిరీస్‌లోని తొలి మ్యాచ్‌ గ్వాలియర్‌ మైదానంలో జరగనుంది. అక్టోబర్‌ 6న తొలి టి20 ధర్మశాలలో జరగాల్సి ఉండగా.. అక్కడ నవీకరణ పనులు సమయానికి పూర్తయ్యే పరిస్థితి లేకపోవడంతో వేదికను బీసీసీఐ మార్చింది.

2010 తర్వాత తొలిసారిగా గ్వాలియర్ మైదానం ఓ అంతర్జాతీయ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. 2010లో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఈ మైదానంలోనే వన్డేల్లో డబుల్ సెంచరీ చేశాడు. గ్వాలియర్‌ నగరంలో ‘శ్రీమంత్‌ మాధవరావు సింధియా క్రికెట్‌ స్టేడియం’ను కొత్తగా నిర్మించిన విషయం తెలిసిందే. 14 ఏళ్ల తర్వాత గ్వాలియర్‌లో తొలి అంతర్జాతీయ మ్యాచ్ జరగనుంది. ఈ విషయం తెలిసిన నగర ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Ticket Price: అభిమానులకు బంపర్ ఆఫర్.. టికెట్ ధర కేవలం 15 రూపాయలే!

మరోవైపు వచ్చే ఏడాది జనవరిలో భారత్, ఇంగ్లండ్‌ జట్ల మధ్య జరగాల్సిన టీ20 మ్యాచ్‌ల వేదికలు కూడా మారాయి. చెన్నై, కోల్‌కతాల్లో జరగాల్సిన మ్యాచ్‌ వేదికల్ని బీసీసీఐ పరస్పరం మార్చింది. జనవరి 22న చెన్నైలో జరగాల్సిన మొదటి టీ20ని కోల్‌కతాలో, 25న కోల్‌కతాలో జరగాల్సిన రెండో మ్యాచ్‌ చెన్నైలో జరగనుంది. గణతంత్ర దినోత్సవం కారణంగా తేదీని మార్చాలని కోల్‌కతా పోలీసులు బెంగాల్ క్రికెట్ అసోసియేషన్‌ను అభ్యర్థించడంతో బీసీసీఐ షెడ్యూల్‌లో మార్పులు చేసింది.