Site icon NTV Telugu

IND vs AUS: ఆస్ట్రేలియాలో టీమిండియా పర్యటన.. వన్డే, టీ20 సిరీస్ షెడ్యూల్ విడుదల

Aus

Aus

IND vs AUS: ఇటీవల జరిగిన చాంపియన్స్ ట్రోఫీ 2025లో అద్భుత ప్రదర్శన చేసి టీమిండియా టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఈ విజయంతో భారత జట్టు మళ్లీ ప్రపంచ క్రికెట్‌లో తన సత్తా చాటింది. ఈ విజయోత్సాహం మధ్యే క్రికెట్ ఆస్ట్రేలియా (CA) తమ 2025-26 ఇంటర్నేషనల్ షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఇందులో భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటన షెడ్యూల్ కూడా ప్రకటించింది. ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ప్రకటించిన వివరాల ప్రకారం, అక్టోబర్ 19 నుంచి నవంబర్ 8 వరకు భారత జట్టు ఆస్ట్రేలియాలో ఎనిమిది అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడనుంది. ఈ టూర్‌లో మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ మ్యాచ్‌లు ఎనిమిది వేర్వేరు వేదికలపై జరగనున్నాయి.

Read Also: SRH Ugadi Wishes: తెలుగు వారికి ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ఎస్‌ఆర్‌హెచ్ టీం.. వీడియో వైరల్

భారత్-ఆస్ట్రేలియా వన్డే షెడ్యూల్:
అక్టోబర్ 19, 2025 – మొదటి వన్డే – పెర్త్ స్టేడియం
అక్టోబర్ 23, 2025 – రెండో వన్డే – అడిలైడ్ ఓవల్
అక్టోబర్ 25, 2025 – మూడో వన్డే – ఎస్‌సీజీ (సిడ్నీ)

భారత్-ఆస్ట్రేలియా టీ20 షెడ్యూల్:
అక్టోబర్ 29, 2025 – మొదటి టీ20 – కాన్‌బెర్రా
అక్టోబర్ 31, 2025 – రెండో టీ20 – ఎంసీజీ (మెల్బోర్న్)
నవంబర్ 2, 2025 – మూడో టీ20 – హోబర్ట్
నవంబర్ 6, 2025 – నాలుగో టీ20 – గోల్డ్ కోస్ట్
నవంబర్ 8, 2025 – ఐదో టీ20 – గబ్బా (బ్రిస్బేన్)

భారత్ టూర్ ముగిసిన వెంటనే నవంబర్ 21న యాషెస్ 2025-26 ప్రారంభం కానుంది. ఈ మెగా సిరీస్‌లో తొలి టెస్టు పెర్త్‌లో జరగనుంది. ఇక ఆస్ట్రేలియా జట్టు కూడా ఆగస్టులో దక్షిణాఫ్రికాతో మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్‌ను ఆడనుంది. భారత క్రికెట్ అభిమానులకు ఈ సిరీస్ ఎంతో ప్రత్యేకం కానుంది. ముఖ్యంగా చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత భారత్ తన ఫామ్‌ను కొనసాగిస్తుందా? అనే ఆసక్తి అందరిలో నెలకొంది. గత సిరీస్‌లను బట్టి చూస్తే ఆసీస్ గడ్డపై టీమిండియా అద్భుత ప్రదర్శన చేయగలదని ఆశించవచ్చు.

Exit mobile version