NTV Telugu Site icon

IND vs AUS: ఆస్ట్రేలియాపై భారత్ ఓటమికి కారణాలివే

India Vs Aus

India Vs Aus

IND vs AUS: బోర్డర్ గవాస్కర్ సిరీస్‌లోని రెండో టెస్టులో ఆస్ట్రేలియా 10 వికెట్ల తేడాతో భారత జట్టును ఓడించి 5 మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఈ పింక్ బాల్ టెస్టులో భారత జట్టు బ్యాట్స్‌మెన్స్ నిరాశపరిచారు. దీంతో భారత జట్టు రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 175 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఆస్ట్రేలియా జట్టుకు 19 పరుగుల స్వల్ప విజయ లక్ష్యం లభించింది. దాంతో వికెట్ కోల్పోకుండా భారత్ పై ఆస్ట్రేలియా భారీ విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో ఆస్ట్రేలియా మరో సరికొత్త రికార్డు సృష్టించింది. అడిలైడ్‌లో పింక్ బాల్‌తో వరుసగా ఎనిమిదో టెస్టును గెలిచిన ఆస్ట్రేలియా రికార్డు సృష్టించింది. ఇకపోతే, భారత్ ఓటమికి కారణాలను చూస్తే..

Also Read: NZ vs Eng: రెండో టెస్టులో విజయం.. సిరీస్ కైవసం చేసుకున్న ఇంగ్లాండ్

కెప్టెన్ రోహిత్ శర్మ పేలవమైన ఫామ్ కొనసాగుతోంది. ఈ డే-నైట్ టెస్ట్ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో రోహిత్ శర్మ 3 పరుగులు చేయగా, రెండో ఇన్నింగ్స్‌లో 6 పరుగులకే అవుటయ్యాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్‌ మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌ చేసినా పెద్ద ఇన్నింగ్స్‌ ఆడలేకపోయాడు. రోహిత్ పేలవ ఫామ్ జట్టుకు ఆందోళన కలిగిస్తుంది. మరోవైపు, భారత క్రికెట్ జట్టు అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లలో ఒకరిగా పిలవబడుతున్నవిరాట్ కోహ్లీ తన బ్యాటింగ్‌లో మరోసారి విఫలమయ్యాడు. మొదటి టెస్ట్ లో సెంచరీ సాధించిన అతను, ఈ టెస్ట్ లో కేవలం మొదటి ఇన్నింగ్స్‌లో 7 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 11 పరుగులు మాత్రమే చేసాడు. విరాట్ కోహ్లీ బ్యాటింగ్ సామర్థ్యాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఈ ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదు. పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్‌లలో బౌలింగ్ సవాళ్లు భిన్నంగా ఉంటాయని తెలిసిందే. ఈ నేపథ్యంలో కోహ్లి వంటి అనుభవజ్ఞుడైన ఆటగాడు మంచి ప్రదర్శన ఇస్తాడనే అంచనాలు ఎప్పుడూ ఉంటాయి. కాకపోతే ఈసారి కోహ్లీ నిరాశపరిచాడు.

ఈ పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్ లో 22 ఏళ్ల యువ ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణాకు చేదు అనుభవం ఎదురైంది. మొదటి ఇన్నింగ్స్‌లో, అతను 16 ఓవర్లు బౌలింగ్ చేసాడు. ఎకానమీ 5.38తో 86 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీసుకోలేక పోయాడు. టెస్టు మ్యాచ్‌లో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయిన హర్షిత్‌కి ఈ మ్యాచ్‌లో పరిస్థితులు మరింత కష్టంగా మారాయి. సీనియర్ ప్లేయర్ ఈ టెస్టు మ్యాచ్‌ ఆర్‌ అశ్విన్‌కు నిరాశ కలిగించింది. అతను మొదటి ఇన్నింగ్స్‌లో 22 పరుగులు చేయగా, రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 7 పరుగులకే అవుట్ అయ్యాడు. ఇక బౌలింగ్‌లో అయితే, ఇన్నింగ్స్‌లో 53 పరుగులిచ్చి కేవలం 1 వికెట్ మాత్రమే తీసుకున్నాడు. దీంతో అతని ప్రదర్శన ఆశించిన స్థాయిలో జరగలేదు.

Also Read: AUS vs IND: ఓవైపు మెన్స్.. మరోవైపు ఉమెన్స్.. ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా భారీ ఓటమి

ఇది ఇలా ఉండగా.. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ శుభారంభాలు వచ్చినా భారీ ఇన్నింగ్స్‌లు స్కోర్ చేయడంలో రిషబ్ పంత్‌ విఫలమవడం అయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో 21 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 28 పరుగులు మాత్రమే సాధించాడు. అడిలైడ్ టెస్టులో ఓడిపోయిన భారత్ ఐసిసి టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో మొదటి స్థానాన్ని మరోసారి కోల్పోయింది. దింతో ఇప్పుడు మూడవ స్థానంలోకి దిగజారింది. ఈ గెలుపు తర్వాత అంతకుముందు మూడో ర్యాంక్‌లో ఉన్న ఆస్ట్రేలియా ఇప్పుడు టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో మొదటి స్థానానికి ఎగబాకింది. రెండో స్థానంలో దక్షిణాఫ్రికా కొనసాగుతుంది.