IND vs AUS: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25 లో భాగంగా పెర్త్ లోని అక్టోపస్ స్టేడియంలో టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా భారీ లక్ష్యాన్ని ఆస్ట్రేలియా ముందు ఉంచింది. మూడో రోజు ఆటలో బ్యాటింగ్ చేసిన టీమిండియా బ్యాటర్లు ఆస్ట్రేలియా బౌలర్లను ధీటుగా ఎదుర్కొని భారీ లక్ష్యాన్ని ఏర్పరిచారు. ఇక ఈ టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా మొదటి ఇన్నింగ్స్ లో కేవలం 150 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఆ తర్వాత మొదటి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 104 పరుగులకే కుప్పకూలింది. దింతో టీమిండియాకు స్వల్ప ఆధిక్యం లభించింది.
Also Read: IND vs AUS: సెంచరీ చేసిన కింగ్ కోహ్లీ.. ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసిన భారత్
ఇక ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ ను మొదలు పెట్టిన టీమిండియా ఓపెనర్స్ జైస్వాల్, కేఎల్ రాహుల్ లు ఆస్ట్రేలియా బౌలర్స్ కు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా భారీ స్కోరును సాధించారు. దింతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీంఇండియా 172 పరుగులు చేసి వికెట్ కోల్పోకుండా నిలిచింది. దింతో టీమిండియాకు 200 పరుగులకు పైగా లీడ్ లభించగా.. అదే ఫామ్ తో మూడో రోజును ఇన్నింగ్స్ ను మొదలు పెట్టారు. ఇక మూడో రోజు టీమిండియా ఓపెనర్ జైస్వాల్ మొదటి సెషన్ లోనే తన నాల్గవ సెంచరీని పూరి చేసుకున్నాడు. అయితే ఆ తరవాత కేఎల్ రాహుల్ 77 పరుగుల వద్ద అవుట్ అవ్వడంతో టీమిండియా మొదటి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన టీమిండియా బ్యాటెర్ దేవదత్ పడిక్కాల్ 25 పరుగులు చేసి అవుట్ కాగా.. ఆ తర్వాత క్రీజ్ లోకి వచ్చిన కింగ్ కోహ్లీ జైస్వాల్ తో కలిసి భారీ స్కోర్ దిశగా స్కోర్ బోర్డును నడిపించారు.
Also Read: IPL Mega Auction: ఐపీఎల్ వేలంలో 12 మంది ప్రత్యేకం.. పంత్ చరిత్ర సృష్టిస్తాడా?
ఈ సమయంలో జైస్వాల్ 161 పరుగులు చేసి అవుట్ అవ్వగా, ఆ తర్వాత వచ్చిన రిషబ్ పంత్, ధృవ్ జురెల్ లో చెరో ఒక పరుగు మాత్రమే చేసి పెవిలియన్ చేరారు. ఆ తర్వాత వాషింగ్టన్ సుందర్ 29 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. ఆపై వచ్చిన హైదరాబాద్ ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి టి20 తరహాలో బ్యాటింగ్ను చేశాడు. దీంతో టీమిండియా స్కోర్ బోర్డ్ పరుగులు పెట్టింది. ఒకవైపు నితీష్ కుమార్ రెడ్డి బౌండరీల వర్షం కురిపిస్తుంటే.. మరోవైపు విరాట్ కోహ్లీ టెస్టులలో తన 30వ సెంచరీని పూర్తి చేయడంతో టీమిండియా రెండో ఇన్నింగ్స్ ను 487 పరుగుల వద్ద 6 వికెట్లు కోల్పోయి డిక్లేర్ చేసింది. దీంతో టీమిండియా ఆస్ట్రేలియా ముందర 533 భారీ లక్ష్య చేదనను ఉంచింది. ఇక రెండు ఇన్నింగ్స్ మొదలు పెట్టిన ఆస్ట్రేలియా ఆదిలోనే వరుస వికెట్లను కోల్పోయింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 12 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతో కష్టాల్లో పడింది. దీంతో మరో ఏడు వికెట్లలో 522 పరుగులు చేయాల్సి ఉంది.