టీమిండియా అంటేనే రెచ్చిపోయే బ్యాటరలలో ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ ఒకడు. కెరీర్ ఆరంభం నుంచి వన్డే, టెస్ట్ ఫార్మాట్‌లలో భారత బౌలర్లను ఓ ఆటాడుకుంటున్నాడు. భారత జట్టుపై స్మిత్ హాఫ్ సెంచరీ, సెంచరీలను అలవోకగా బాదేస్తున్నాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో గబ్బాలో జరిగిన మూడో టెస్ట్‌లో శతకం బాదిన స్మిత్.. ప్రస్తుతం మెల్‌బోర్న్‌లో జరుగుతున్న నాలుగో టెస్టులో సెంచరీ చేశాడు. స్మిత్‌కు ఇది టెస్ట్ కెరీర్‌లో 34వ సెంచరీ. అదేసమయంలో మెల్‌బోర్న్‌లో ఐదవ శతకం.
మెల్‌బోర్న్‌లో సెంచరీ చేసిన స్టీవ్ స్మిత్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. భారత్‌పై అత్యధిక టెస్ట్ సెంచరీలు బాదిన ఆటగాడిగా రికార్డులో నిలిచాడు. టీమిండియాపై 43 ఇన్నింగ్స్‌ల్లో 11వ సెంచరీలు చేశాడు. ప్రపంచంలో ఏ బ్యాటర్ కూడా భారత్‌పై ఇన్ని టెస్ట్ సెంచరీలు చేయలేదు. ఈ జాబితాలో ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్ జో రూట్ 10 సెంచరీలతో రెండో స్థానంలో ఉన్నాడు. గ్యారీ ఫీల్డ్ సోబర్స్ (8), వివ్ రిచర్డ్స్ (8), రికీ పాంటింగ్ (8) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
Also Read: Realme 14 Pro Launch: భారత్‌కు రంగు మారే స్మార్ట్‌ఫోన్ వచ్చేస్తోంది.. ప్రపంచంలోనే మొదటి మొబైల్!
టెస్ట్‌ల్లో స్టీవ్ స్మిత్ మరో రికార్డును కూడా తన పేరుపై లిఖించుకున్నాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా నిలిచాడు. బీజీటీలో 41 ఇన్నింగ్స్‌లలో 10 సెంచరీలు బాదాడు. విరాట్ కోహ్లీ 47 ఇన్నింగ్స్‌లలో 9, సచిన్ టెండూల్కర్ 65 ఇన్నింగ్స్‌లలో 9, రికీ పాంటింగ్ 51 ఇన్నింగ్స్‌లలో 8, మైఖేల్ క్లార్క్ 40 ఇన్నింగ్స్‌లలో 7 సెంచరీలు చేశారు. ఇక టెస్ట్‌ల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో 11వ స్థానానికి చేరాడు. దాంతో దిగ్గజాలు బ్రియాన్ లారా, సునీల్ గవాస్కర్, యూనిస్ ఖాన్, జయవర్దనే సరసన చేరాడు.