Boxing Day Test: తుది జట్టును ప్రకటించిన ఆస్ట్రేలియా.. కొత్త ఆటగాడికి అవకాశం!
- ఆస్ట్రేలియా, భారత్ నాలుగో టెస్టు
- తుది జట్టును ప్రకటించిన ఆస్ట్రేలియా
- సామ్ కాన్ట్సాస్‌కు అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో భాగంగా గురువారం నుంచి మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య నాలుగో టెస్టు ప్రారంభం కానుంది. ఐదు టెస్ట్ మ్యాచుల సిరీస్ 1-1తో సమంగా ఉన్న నేపథ్యంలో బాక్సింగ్ డే టెస్ట్ కీలకంగా మారింది. ఈ టెస్టులో గెలిచి సిరీస్‌లో ఆధిక్యం సాధించాలని ఇరు జట్లు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా, భారత్ జట్లు బలమైన జట్లతో బరిలోకి దిగుతున్నాయి. బాక్సింగ్ డే టెస్టు కోసం ఆసీస్ తన తుది జట్టును ప్రకటించింది. 19 ఏళ్ల సామ్ కాన్ట్సాస్‌కు అవకాశం ఇచ్చింది.
బాక్సింగ్ డే టెస్టు కోసం ఆస్ట్రేలియా మేనేజ్మెంట్ రెండు మార్పులు చేసింది. ఓపెనర్ నాథన్ మెక్‌స్వీనీ స్థానంలో యువ ఆటగాడు సామ్ కాన్ట్సాస్‌కు అవకాశం ఇచ్చింది. గాయం కారణంగా సిరీస్‌కు దూరమైన స్టార్ పేసర్ జోష్ హేజిల్‌వుడ్ స్థానంలో స్కాట్ బొలాండ్‌ను మూడో ప్రధాన పేసర్‌గా తీసుకుంది. బొలాండ్ రెండో టెస్ట్ ఆడిన విషయం తెలిసిందే. గాయపడిన హేజిల్‌వుడ్ రావడంతో మూడో టెస్టుకు దూరమయ్యాడు. డేంజరస్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ ఫిట్నెస్ టెస్టులో పాస్ కావడంతో తుది జట్టులో చోటు దక్కింది.
Also Read
- Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
- GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
భారత్‌తో వార్మప్ మ్యాచ్‌లో ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవన్ జట్టు తరఫున సామ్ కాన్ట్సాస్ ఆడాడు. 97 బంతుల్లో 107 రన్స్ చేశాడు. మహమ్మద్ సిరాజ్, రవీంద్ర జడేజా వంటి బౌలర్లను ఎదుర్కొని సెంచరీ సాధించాడు. ఇక బాక్సింగ్ డే టెస్టులో ఆస్ట్రేలియా తరఫున ఉస్మాన్ ఖవాజాతో కలిసి అతడు ఇన్నింగ్స్‌ను ఆరంబించనున్నాడు. మెక్‌స్వీనీ విఫలమైన వేళ కాన్ట్సాస్ ఎలా ఆడుతాడో చూడాలి.
Also Read: Varun Dhawan: అలియా, కియారాలతో తప్పుగా ప్రవర్తించలేదు: వరుణ్
ఆస్ట్రేలియా తుది జట్టు:
ఉస్మాన్ ఖవాజా, సామ్ కొన్ట్సాస్, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ కేరీ (వికెట్ కీపర్), పాట్ కమిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లైయన్, స్కాట్ బొలాండ్.
తాజావార్తలు
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!