Glenn Maxwell Century: మ్యాక్స్‌వెల్ ఊచకోత.. ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు సమం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Glenn Maxwell Equals Josh Inglis, Aaron Finch Fastest T20I Century Record: ఆస్ట్రేలియాతో ఐదు టీ20ల సిరీస్‌లో భారత్ వరుస విజయాలకు బ్రేక్ పడింది. సిరీస్‌లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా అనూహ్య విజయం సాధించింది. అసాధారణ బ్యాటింగ్‌తో కొండత లక్ష్యాన్ని చేధించిమన ఆసీస్.. చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. హార్డ్ హిట్టర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ (104 నాటౌట్; 48 బంతుల్లో 8 ఫోర్లు, 8 సిక్సర్స్) సూపర్ సెంచరీతో చెలరేగడంతో ఆసీస్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. చివరి రెండు ఓవర్లలో మ్యాక్స్‌వెల్ ఊచకోత కారణంగా ఆస్ట్రేలియా గట్టెక్కింది.
223 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు సరైన ఆరంభం దక్కలేదు. ట్రవిస్ హెడ్ (35), ఆరోన్ హార్డీ (16), జోష్ ఇంగ్లిస్ (10), మార్కస్ స్టోయినిస్ (17) తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేరారు. ఈ సమయంలో గ్లెన్ మ్యాక్స్‌వెల్ మాథ్యూ వేడ్ (28 నాటౌట్; 16 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్) సహకారంతో చెలరేగాడు. ఆసీస్ విజయానికి చివరి రెండు ఓవర్లలో 43 పరుగులు అవసరం కావడంతో.. భారత గెలుపు లాంఛనమే అనుకున్నారంతా. అయితే మ్యాక్సీ 19వ ఓవర్‌లో 22 పరుగులు, 20వ ఓవర్‌లో 23 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియాకు విజయాన్ని అందించడమే కాకుండా.. ఫాస్టెస్ట్ సెంచరీ చేశాడు.
Also Read
- Karnataka: కొత్త ప్రభుత్వం ఏర్పాటు వేళ హోంమంత్రి పరమేశ్వర అలక.. మరో సంక్షోభం తప్పదా?
- Karnataka High Court: చేతులు, కాళ్లు నరికేస్తే చట్టాలు పాటిస్తారేమో.. హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు..
- Palak Pakoda Recipe: సింపుల్‌గా ఇంటి వద్దే కరకరలాడే పాలక్ పకోడాలు.. ఇలా రెడీ తయారు చేయండి..
- West Bengal Politics: మమతా పార్టీలో ‘‘షిండే’’ రాజకీయాలు.. తృణమూల్‌లో తీవ్ర సంక్షోభం..
గ్లెన్ మ్యాక్స్‌వెల్ 47 బంతుల్లోనే సెంచరీ బాదాడు. దాంతో ఆస్ట్రేలియా తరఫున పొట్టి క్రికెట్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డును సమం చేశాడు. అంతకుముందు ఆరోన్ ఫించ్, జోష్ ఇంగ్లిస్ కూడా 47 బంతుల్లోనే సెంచరీలు చేశారు. ఆసీస్ తరఫున టీ20ల్లో టాప్ 5 ఫాస్టెస్ట్ శతకాల్లో.. మ్యాక్స్‌వెల్‌వే మూడు ఉండటం విశేషం. ఇదివరకు 49 బంతుల్లో, 50 బంతుల్లో టీ20 సెంచరీలు బాదాడు. భారత పర్యటనలో మ్యాక్స్‌వెల్ మూడు శతకాలు బాదాడు. వరల్డ్‌కప్ 2023లో రెండు శతకాలు చేసిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Buchi Babu Sana: ‘ఆ విషయంలో చిరంజీవి గారు ఫోన్ చేసి తిడతారేమో అనుకున్నా’: బుచ్చిబాబు
-
Karnataka: కొత్త ప్రభుత్వం ఏర్పాటు వేళ హోంమంత్రి పరమేశ్వర అలక.. మరో సంక్షోభం తప్పదా?
-
Karnataka High Court: చేతులు, కాళ్లు నరికేస్తే చట్టాలు పాటిస్తారేమో.. హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు..
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Palak Pakoda Recipe: సింపుల్‌గా ఇంటి వద్దే కరకరలాడే పాలక్ పకోడాలు.. ఇలా రెడీ తయారు చేయండి..
ట్రెండింగ్
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్‌తో Itel Aqua లాంచ్.!
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!