NTV Telugu Site icon

Glenn Maxwell Century: మ్యాక్స్‌వెల్‌ ఊచకోత.. ఫాస్టెస్ట్‌ సెంచరీ రికార్డు సమం!

Glenn Maxwell Century New

Glenn Maxwell Century New

Glenn Maxwell Equals Josh Inglis, Aaron Finch Fastest T20I Century Record: ఆస్ట్రేలియాతో ఐదు టీ20ల సిరీస్‌లో భారత్ వరుస విజయాలకు బ్రేక్ పడింది. సిరీస్‌లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా అనూహ్య విజయం సాధించింది. అసాధారణ బ్యాటింగ్‌తో కొండత లక్ష్యాన్ని చేధించిమన ఆసీస్.. చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. హార్డ్ హిట్టర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ (104 నాటౌట్; 48 బంతుల్లో 8 ఫోర్లు, 8 సిక్సర్స్) సూపర్ సెంచరీతో చెలరేగడంతో ఆసీస్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. చివరి రెండు ఓవర్లలో మ్యాక్స్‌వెల్ ఊచకోత కారణంగా ఆస్ట్రేలియా గట్టెక్కింది.

223 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు సరైన ఆరంభం దక్కలేదు. ట్రవిస్‌ హెడ్‌ (35), ఆరోన్‌ హార్డీ (16), జోష్‌ ఇంగ్లిస్‌ (10), మార్కస్‌ స్టోయినిస్‌ (17) తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేరారు. ఈ సమయంలో గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ మాథ్యూ వేడ్‌ (28 నాటౌట్‌; 16 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌) సహకారంతో చెలరేగాడు. ఆసీస్ విజయానికి చివరి రెండు ఓవర్లలో 43 పరుగులు అవసరం కావడంతో.. భారత గెలుపు లాంఛనమే అనుకున్నారంతా. అయితే మ్యాక్సీ 19వ ఓవర్‌లో 22 పరుగులు, 20వ ఓవర్‌లో 23 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియాకు విజయాన్ని అందించడమే కాకుండా.. ఫాస్టెస్ట్‌ సెంచరీ చేశాడు.

Also Read: YSRCP Samajika Sadhikara Bus Yatra 24 Day: 24వ రోజుకు చేరిన వైసీపీ సామాజిక సాధికార యాత్ర.. ఈ రోజు షెడ్యూల్..

గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ 47 బంతుల్లోనే సెంచరీ బాదాడు. దాంతో ఆస్ట్రేలియా తరఫున పొట్టి క్రికెట్‌లో ఫాస్టెస్ట్‌ సెంచరీ రికార్డును సమం చేశాడు. అంతకుముందు ఆరోన్‌ ఫించ్‌, జోష్‌ ఇంగ్లిస్‌ కూడా 47 బంతుల్లోనే సెంచరీలు చేశారు. ఆసీస్‌ తరఫున టీ20ల్లో టాప్‌ 5 ఫాస్టెస్ట్‌ శతకాల్లో.. మ్యాక్స్‌వెల్‌వే మూడు ఉండటం విశేషం. ఇదివరకు 49 బంతుల్లో, 50 బంతుల్లో టీ20 సెంచరీలు బాదాడు. భారత పర్యటనలో మ్యాక్స్‌వెల్‌ మూడు శతకాలు బాదాడు. వరల్డ్‌కప్‌ 2023లో రెండు శతకాలు చేసిన విషయం తెలిసిందే.