IND vs AUS: టాస్ గెలిచిన రోహిత్.. మూడు మార్పులతో బరిలోకి భారత్! తుది జట్లు ఇవే
- అడిలైడ్ వేదికగా డే/నైట్ టెస్ట్
- మూడు మార్పులతో బరిలోకి భారత్
- మిడిల్ ఆర్డర్‌లో రోహిత్ శర్మ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో భాగంగా మరికొద్దిసేపట్లో అడిలైడ్ వేదికగా పింక్ బాల్ (డే/నైట్) టెస్ట్ మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ టెస్టులో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. మూడు మార్పులతో బరిలోకి దిగుటున్నట్లు హిట్‌మ్యాన్ చెప్పాడు. తాను, శుభ్‌మన్ గిల్, రవిచంద్రన్ అశ్విన్ ఆడుతున్నట్లు తెలిపాడు. పెర్త్ టెస్టులో ఆడిన వాషింగ్టన్ సుందర్, ధృవ్ జురెల్, దేవదత్ పడిక్కల్‌లు పెవిలియన్‌కే పరిమితం అయ్యారు.
డే/నైట్ టెస్టులో ఓపెనర్‌గా లోకేష్ రాహుల్ఆడుతున్నడని, తాను మిడిల్ ఆర్డర్‌లో రానున్నట్లు కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. మరోవైపు ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఒక మార్పు చేసినట్లు చెప్పాడు. గాయపడిన జోష్ హేజిల్‌వుడ్ స్థానంలో స్కాట్ బోలాండ్ జట్టులోకి వచ్చాడు. ఇప్పటికే ఐదు టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లిన భారత్.. పింక్ బాల్ టెస్టులో కూడా గెలవాలని భావిస్తోంది. సొంతగడ్డపై ఆడుతోన్న ఆస్ట్రేలియా పరిస్థితులను సద్వినియోగం చేసుకోవాలని చూస్తోంది. పింక్ బాల్ టెస్టులో మంచి రికార్డు ఉన్న ఆసీస్‌ను ఆపడం కాస్త కష్టమే.
Also Read
- World's Highest-Earning Cities: ప్రపంచంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న నగరాలు.. టాప్ 40లో 27 అమెరికా సిటీలే..!
- Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
- Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
- Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
Also Read: Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ సందిగ్ధతకు తెర.. టీమిండియాకు షాక్!
తుది జట్లు:
భారత్: యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్ (కీపర్), రోహిత్ శర్మ (కెప్టెన్), నితీశ్ రెడ్డి, రవిచంద్రన్ అశ్విన్, హర్షిత్ రాణా, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్.
ఆస్ట్రేలియా: ఉస్మాన్ ఖవాజా, నాథన్ మెక్‌స్వీనీ, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ కేరీ (కీపర్), పాట్ కమిన్స్ (కెప్టెన్), నాథన్ లైయన్, స్కాట్ బోలాండ్.
తాజావార్తలు
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యాకు ఆఫర్లే ఆఫర్లు.. అతడితో విబేధాల ప్రభావం ట్రేడ్‌పై ఉంటుందా?
-
World’s Highest-Earning Cities: ప్రపంచంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న నగరాలు.. టాప్ 40లో 27 అమెరికా సిటీలే..!
-
Jailer 2 : ‘జైలర్ 2’లో ఫ్యామిలీ ఎమోషన్స్ కు చోటు లేదా?.. నెల్సన్ దాచిన సర్ప్రైజ్ ఏంటి?
-
Rejinagar Bypoll: రెజినగర్ ఉప ఎన్నికలో హైటెన్షన్.. ఓటు వేసిన వెంటనే ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ అరెస్ట్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
ట్రెండింగ్
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి