NTV Telugu Site icon

IND vs AUS: టాస్ గెలిచిన రోహిత్.. మూడు మార్పులతో బరిలోకి భారత్! తుది జట్లు ఇవే

Ind Vs Aus

Ind Vs Aus

బోర్డర్‌-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో భాగంగా మరికొద్దిసేపట్లో అడిలైడ్‌ వేదికగా పింక్‌ బాల్ (డే/నైట్) టెస్ట్ మ్యాచ్‌ ఆరంభం కానుంది. ఈ టెస్టులో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. మూడు మార్పులతో బరిలోకి దిగుటున్నట్లు హిట్‌మ్యాన్ చెప్పాడు. తాను, శుభ్‌మన్‌ గిల్‌, రవిచంద్రన్ అశ్విన్ ఆడుతున్నట్లు తెలిపాడు. పెర్త్ టెస్టులో ఆడిన వాషింగ్టన్ సుందర్, ధృవ్ జురెల్, దేవదత్ పడిక్కల్‌లు పెవిలియన్‌కే పరిమితం అయ్యారు.

డే/నైట్ టెస్టులో ఓపెనర్‌గా లోకేష్ రాహుల్ఆడుతున్నడని, తాను మిడిల్‌ ఆర్డర్‌లో రానున్నట్లు కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. మరోవైపు ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఒక మార్పు చేసినట్లు చెప్పాడు. గాయపడిన జోష్ హేజిల్‌వుడ్ స్థానంలో స్కాట్ బోలాండ్ జట్టులోకి వచ్చాడు. ఇప్పటికే ఐదు టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లిన భారత్.. పింక్‌ బాల్ టెస్టులో కూడా గెలవాలని భావిస్తోంది. సొంతగడ్డపై ఆడుతోన్న ఆస్ట్రేలియా పరిస్థితులను సద్వినియోగం చేసుకోవాలని చూస్తోంది. పింక్ బాల్ టెస్టులో మంచి రికార్డు ఉన్న ఆసీస్‌ను ఆపడం కాస్త కష్టమే.

Also Read: Champions Trophy 2025: ఛాంపియన్స్‌ ట్రోఫీ సందిగ్ధతకు తెర.. టీమిండియాకు షాక్!

తుది జట్లు:
భారత్: యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, శుభ్‌మన్‌ గిల్, విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్ (కీపర్), రోహిత్ శర్మ (కెప్టెన్), నితీశ్ రెడ్డి, రవిచంద్రన్ అశ్విన్, హర్షిత్ రాణా, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్.
ఆస్ట్రేలియా: ఉస్మాన్ ఖవాజా, నాథన్ మెక్‌స్వీనీ, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ కేరీ (కీపర్), పాట్ కమిన్స్ (కెప్టెన్), నాథన్‌ లైయన్, స్కాట్ బోలాండ్.

 

Show comments