IND vs AUS: మెల్‌బోర్న్ వేదికగా జరిగిన రెండో టీ20లో ఆస్ట్రేలియా జట్టు భారత్‌పై సునాయాస విజయం సాధించింది. 126 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా కేవలం 13.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి, 40 బంతులు మిగిలి ఉండగానే టార్గెట్ ను చేధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆస్ట్రేలియా 1–0 ముందడుగు వేసింది. మొదటి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయిన సంగతి తెలిసిందే. ఇక నేటి మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన భారత బ్యాటర్లు మరోసారి విఫలమయ్యారు. అభిషేక్ శర్మ (68; 37 బంతులు, 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) మాత్రమే రాణించగా.. మిగతా బ్యాటర్లు వరుసగా పెవిలియన్ చేరారు. హర్షిత్ రాణా (35) కొంత ప్రతిఘటన చూపించినా పెద్దగా ప్రయోజనం లేకపోయింది. మిగతా వారిలో గిల్ (5), సూర్యకుమార్ (1), సంజు శాంసన్ (2), తిలక్ వర్మ (0) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. దీనితో భారత్ కేవలం 18.4 ఓవర్లలో 125 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆస్ట్రేలియా బౌలర్లలో జోష్ హేజిల్‌వుడ్ 3 వికెట్లు.. నాథన్ ఎలిస్, జేవియర్ బార్ట్‌లెట్ లు రెండు వికెట్లు సాధించగా, మార్కస్ స్టోయినిస్ ఒక వికెట్ తీసుకున్నారు.
స్టైలిష్ లుక్, ADAS లెవెల్ 2 ఫీచర్, అబ్బురపరిచే ఫీచర్లతో లాంచ్కు సిద్దమైన Hyundai Venue N..!
ఇక తక్కువ లక్ష్యాన్ని చేధించడంలో ఆస్ట్రేలియా మొదట నుంచే దూకుడుగా ఆడింది. కెప్టెన్ మిచెల్ మార్ష్ 26 బంతుల్లో 46 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను టాప్ గేర్ లో ప్రారంభించాడు. అతనికి తోడుగా ట్రావిస్ హెడ్ 15 బంతుల్లో 28 పరుగులు చేశాడు. ఆ తర్వాత జోష్ ఇంగ్లిస్ 20 పరుగులు చేసి జట్టును విజయదిశగా నడిపించాడు. చివర్లో కొద్ది వికెట్లు కోల్పోయినా ఆస్ట్రేలియా సునాయాసంగా విజయం సాధించింది. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్ లు రెండు వికెట్లు తీయగా.. వరుణ్ చక్రవర్తి కూడా రెండు వికెట్లు సాధించాడు. కానీ తక్కువ లక్ష్యాన్ని కాపాడడంలో వీరి ప్రయత్నం సరిపోలేదు.
200MP+50MP+50MP+50MP కెమెరా, 5440mAh బ్యాటరీతో ఫ్లాగ్‌షిప్ సంచలనం Vivo X300 Pro లాంచ్..!
