NTV Telugu Site icon

IND vs AFG: అఫ్గానిస్థాన్‌తో రెండో టీ20.. ఏకైక క్రికెటర్‌గా చరిత్ర సృష్టించనున్న రోహిత్‌ శర్మ!

Rohit

Rohit

Rohit Sharma On Verge Of Historic Milestone: మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా నేడు ఇండోర్‌లోని హోల్కర్‌ స్టేడియంలో భారత్, అఫ్గానిస్థాన్‌ జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ ద్వారా టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఖాతాలో అత్యంత అరుదైన రికార్డు చేరనుంది. నేడు రోహిత్ మైదానంలోకి దిగగానే.. 150వ అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ఆడిన మొదటి క్రికెటర్‌గా చరిత్ర సృష్టిస్తాడు. ఇప్పటివరకు ఏ క్రికెటర్ కూడా 150 అంతర్జాతీయ టీ20లు ఆడలేదు. రోహిత్ ఇప్పటివరకు 149 టీ20లు ఆడాడు.

2007 టీ20 ప్రపంచ కప్ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై అరంగేట్రం చేసిన రోహిత్‌ శర్మ.. ఇప్పటివరకు 149 మ్యాచ్‌లు ఆడాడు. ఐర్లాండ్ కెప్టెన్ పాల్ స్టిర్లింగ్ (134) ఈ జాబితాలో రెండవ స్థానంలో ఉన్నాడు. ఐరిష్ ఆటగాడు జార్జ్ డాక్రెల్ (128), పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ (124), న్యూజిలాండ్‌కు మాజీ ఓపెనర్ మార్టిన్ గుప్తిల్ (122) తర్వాతి ఉన్నారు. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (115) 11వ స్థానంలో ఉన్నాడు. టీ20 ఫార్మాట్‌లో 100కి పైగా అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన రెండవ భారతీయుడు కోహ్లీ.

Also Read: IND vs AFG: అఫ్గానిస్థాన్‌తో రెండో టీ20.. సిరీస్‌పై కన్నేసిన భారత్! కళ్లన్నీ కోహ్లీపైనే

దాదాపు పద్నాలుగు నెలల సుదీర్ఘ విరామం తర్వాత రోహిత్‌ శర్మ అంతర్జాతీయ టీ20లలో పునరాగమనం చేశాడు. టీ20 ప్రపంచకప్‌ 2022 సెమీస్‌లో భారత జట్టు ఓటమి తర్వాత.. మళ్లీ అఫ్గనిస్తాన్‌తో సిరీస్‌తో రీఎంట్రీ ఇచ్చాడు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మొహాలీలో బరిలోకి దిగిన రోహిత్‌ దురదృష్టవశాత్తూ రనౌట్‌ అయ్యాడు. అయితే భారత్ గెలవడంతో అంతర్జాతీయ టీ20లలో 100 మ్యాచ్‌లు గెలిచిన ఏకైక పురుష క్రికెటర్‌గా హిట్‌మ్యాన్‌ చరిత్ర సృష్టించాడు.