IND vs AFG 1st T20 Prediction and Playing 11: దక్షిణాఫ్రికా పర్యటన అనంతరం అఫ్గానిస్థాన్‌తో టీ20 సిరీస్‌కు భారత్ సిద్ధమైంది. 2024 జూన్ 1న ఆరంభమయ్యే టీ20 ప్రపంచకప్‌పై కన్నేసిన భారత్.. ఆ కప్పు కంటే ముందు పొట్టి ఫార్మాట్లో అఫ్గానిస్థాన్‌తో చివరి సిరీస్ ఆడనుంది. ఈ నేపథ్యంలో ఈ సిరీస్ ఆసక్తికరంగా మారింది. మూడు మ్యాచ్‌ల్లోనూ నెగ్గి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చెలయాలని భారత్ చూస్తోంది. గురువారం జరిగే తొలి టీ20లో గెలిచి శుభారంభం చేయాలని రోహిత్ సేన భావిస్తోంది. బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు, జట్టు కూర్పులో తేడాలతో ఈ మ్యాచ్‌లో భారత్ కొత్తగా కనిపించనుంది. మరోవైపు స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ లేకుండా అఫ్గాన్ బరిలోకి దిగుతోంది.
గాయాలతో హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, రుతురాజ్ గైక్వాడ్ జట్టుకు దూరమయ్యారు. ఇషాన్ కిషన్‌కు జట్టులో చోటు దక్కలేదు. 2022 టీ20 ప్రపంచకప్ సెమీస్ తర్వాత రోహిత్ శర్మ తిరిగి పొట్టి ఫార్మాట్లో ఆడుతున్నాడు. రోహిత్‌తో కలిసి యశస్వి జైస్వాల్ ఓపెనింగ్ చేయనున్నాడు. వ్యక్తిగత కారణాలతో ఈ మ్యాచ్‌కు దూరమైన విరాట్ కోహ్లీ స్థానంలో హైదరాబాద్ ప్లేయర్ తిలక్ వర్మ బరిలోకి దిగనున్నాడు. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాతో టీ20ల్లో సత్తాచాటిన రింకు సింగ్ నాలుగో స్థానంలో ఆడుతాడు. వికెట్ కీపర్ స్థానం కోసం సంజూ శాంసన్, జితేశ్ శర్మ మధ్య పోటీ ఉన్నా.. గత రెండు సిరీస్‌ల్లో రాణించిన జితేశ్‌కే అవకాశం దక్కొచ్చు. హార్దిక్ స్థానాన్ని శివమ్ దూబె భర్తీ చేయనున్నాడు. పేసర్లుగా అవేష్ ఖాన్, ముకేశ్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్ ఆడనున్నారు. ఓ స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్ ఆడనుండగా.. మరో స్థానం కోసం రవి బిష్ణోయ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ రేసులో ఉన్నారు. ఓ పేసర్ వద్దనుకుంటే.. సంజూ తుది జట్టులోకి వస్తాడు.
రషీద్ ఖాన్ లేకుండానే అఫ్గానిస్థాన్ బరిలో దిగుతోంది. గత నవంబర్‌లో వెన్నెముకకు శస్త్రచికిత్స చేయించుకున్న రషీద్ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. రషీద్ లేకపోయినా అఫ్గాన్‌ను తక్కువ అంచనా వేయడానికి లేదు. వన్డే ప్రపంచకప్ 2023లో ఇంగ్లండ్, పాకిస్థాన్, శ్రీలంకపై సంచలన విజయాలు సాధించింది. ఇబ్రహీం జద్రాన్, గుర్బాజ్, ఒమర్‌జాయ్, నజీబుల్లాలతో బ్యాటింగ్ విభాగం మెరుగ్గానే ఉంది. ముజీబ్ రెహ్మాన్, నూర్ అహ్మద్, నబి, నవీనుల్ హక్, ఫారూఖీలతో బౌలింగ్ పటిష్టంగానే ఉంది. ఐపీఎల్‌లో ఆడుతున్న ఈ ఆటగాళ్లకు ఇక్కడి పరిస్థితులపై మంచి అవగాహన ఉండడం వారికీ కలిసొచ్చే అంశం.
మొహాలి పిచ్ బ్యాటింగ్‌కే అనుకూలం. ఈ పిచ్‌లో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశముంది. ఆరంభంలో పేసర్లకు.. మ్యాచ్ సాగుతున్నా కొద్దీ స్పిన్నర్లకూ పరిస్థితులు అనుకూలంగా మారతాయి. రెండో ఇన్నింగ్స్‌లో మంచు ప్రభావం ఉంటుంది. మొహాలిలో 6 టీ20ల్లో ఛేదనకు దిగిన జట్లు నాలుగు సార్లు గెలిచాయి. అత్యంత చలి వాతావరణంలో ఆడటం ఆటగాళ్లకు పెను సవాలే. మొహాలిలో నాలుగు టీ20లు ఆడిన భారత్ మూడు మ్యాచ్‌ల్లో నెగ్గింది.
Also Read: Gold Rate Today: స్థిరంగా బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతుందంటే?
తుది జట్లు (అంచనా):
భారత్: రోహిత్, యశస్వి, తిలక్, రింకు,దూబె, జితేశ్, అక్షర్, కుల్దీప్, అర్ష్‌దీప్, ముకేశ్, అవేష్.
అఫ్గానిస్థాన్: ఇబ్రహీం జద్రాన్, ఒమర్‌జాయ్, గుర్బాజ్, కరీం జనాత్, నజీబుల్లా జద్రాన్, నబి, నూర్ అహ్మద్, నవీనుల్ హక్, ఫారూఖీ, ముజీబ్, హజ్రతుల్లా.