NTV Telugu Site icon

IND vs ENG: బుమ్రా ఎంట్రీ.. కుల్దీప్‌పై వేటు! ఇంగ్లండ్‌తో చివరి టెస్ట్ ఆడే భారత తుది జట్టిదే

Team India Test

Team India Test

IND vs ENG 5th Test Predicted Playing 11: ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను భారత్ ఇప్పటికే 3-1తో కైవసం చేసుకుంది. తొలి టెస్టులో ఓడినా.. వరుసగా మూడ్ టెస్టులు గెలిచిన టీమిండియా మరో టెస్ట్ ఉడగానే సిరీస్ పట్టేసింది. ఇక భారత్, ఇంగ్లండ్‌ జట్ల మధ్య గురువారం నుంచి ధర్మశాల వేదికగా ఆఖరి మ్యాచ్‌ ఆరంభం కానుంది. ఈ టెస్టులో కూడా విజయం సాధించి.. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023-25 పాయింట్స్ టేబుల్‌లో భారత్ తమ అగ్రస్థానాన్ని మరింత పదిలంగా చేసుకోవాలనుకుంటోంది. మరోవైపు ఆఖరి మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు కాపాడుకోవాలని ఇంగ్లండ్ భావిస్తోంది.

ఇంగ్లండ్‌తో చివరి టెస్ట్ ఆడే భారత తుది జట్టు ఎలా ఉండనుందో చూద్దాం. ధర్మశాల ఎత్తైన ప్రాంతంలో ఉండటంతో వాతావరణం చల్లగా ఉంటుంది. పిచ్ పేస్‌కు అనుకూలం. బంతి స్వింగ్ అయ్యే అవకాశం ఉండడంతో.. గత టెస్టుల్లో ముగ్గురు స్పిన్నర్లతో ఆడిన ఇరు జట్లు ధర్మశాలలో మాత్రం ఎక్స్‌ట్రా పేసర్‌తో బరిలోకి దిగే అవకాశం ఉంది. నాలుగో టెస్ట్‌కు దూరమైన జస్ప్రీత్ బుమ్రా అందుబాటులోకి వచ్చాడు. అతడితో పాటు మహమ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్ పేస్ కోటాలో ఆడనున్నారు. ఆకాశ్ అసాధారణ ప్రదర్శన చేసిన విషయం తెలిసిందే.

ముగ్గురు పేసర్లతో భారత్ బరిలోకి దిగితే స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌‌పై వేటు పడనుంది. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా స్పిన్ కోటాలో ఆడుతారు. పిచ్ పరిస్థితులను బట్టి కెప్టెన్ రోహిత్ శర్మ నిర్ణయం తీసుకొనున్నాడు. రోహిత్ శర్మకు రెస్ట్ ఇస్తారని ప్రచారం జరిగినా.. మంగళవారమే అతడు ధర్మశాలకు చేరుకున్నాడు. దాంతో రోహిత్, యశస్వి జైస్వాల్ ఓపెనింగ్ చేస్తారు. శుభ్‌మన్ గిల్ ఫామ్ అందుకున్నాడు. గత మూడు మ్యాచ్‌ల్లో విఫలమైన రజత్ పటీదార్‌పై వేటు వేస్తారా? లేదా చివరి అవకాశం ఇస్తారో? చూడాలి. ఒకవేళ పటీదార్‌పై వేటు వేస్తే.. దేవదత్ పడిక్కల్ అరంగేట్రం చేస్తాడు. ధ్రువ్ జురెల్, సర్ఫరాజ్ ఖాన్ కొనసాగుతారు.

Also Read: Rohit Sharma: రిషబ్ పంత్ ఆట చూసుండడు.. బెన్ డకెట్‌పై రోహిత్ శర్మ సెటైర్లు!

భారత తుది జట్టు (అంచనా):
రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, దేవదత్ పడిక్కల్/రజత్ పటీదార్, ధ్రువ్ జురెల్ (కీపర్), సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్/కుల్దీప్ యాదవ్.