Site icon NTV Telugu

IND vs SL: శ్రీలంకతో మూడో టీ20.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లపై వేటు! భారత్ తుది జట్టు ఇదే

Hardik Pandya Suryakumar

Hardik Pandya Suryakumar

IND vs SL 3rd T20 Playing 11: శ్రీలంక పర్యటనలో భారత జట్టు టీ20 సిరీస్‌ను కైవసం చేసుకుంది. మరో మ్యాచ్ మిగిలుండగానే.. మూడు టీ20ల సిరీస్‌ను 2-0తో సాధించింది. చివరిదైన మూడో టీ20 మ్యాచ్ పల్లెకెల వేదికగా మంగళవారం (జులై 30) రాత్రి జరగనుంది. నామమాత్రమైన ఈ మ్యాచ్‌లో బెంచ్‌ బలాన్ని టీమిండియా పరీక్షించనుంది. ఈ విషయాన్ని రెండో మ్యాచ్ అనంతరం కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చెప్పాడు. ఈ క్రమంలో భారత తుది జట్టులో మార్పులు జరిగే అవకాశ ఉంది.

ఓపెనర్లుగా యశస్వీ జైస్వాల్, సంజు శాంసన్ కొనసాగనున్నారు. రెండో టీ20లో గోల్డెన్ డకౌటైన శాంసన్‌కు మరో అవకాశం ఇవ్వాలని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తోంది. రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్ 3, 4 స్థానాల్లో రానున్నారు. మిడిల్ ఆర్డర్‌లో రియాన్ పరాగ్, రింకూ సింగ్ జట్టులో ఉంటారు. ఆల్‌రౌండర్లు హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్‌కు విశ్రాంతిని ఇచ్చి.. శివమ్ దూబె, వాషింగ్టన్ సుందర్‌లం ఆడించాలని చూస్తున్నారని తెలుస్తోంది. స్పెసలిస్ట్ స్పిన్ కోటాలో రవి బిష్ణోయ్ ఆడనున్నాడు. పేసర్ అర్షదీప్ సింగ్‌ స్థానంలో ఖలీల్ అహ్మద్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. అర్షదీప్ ఇటీవల ఎక్కువగా మ్యాచులు ఆడిన విషయం తెలిసిందే.

Also Read: Dhanush Post: బెస్ట్‌ బర్త్‌డే గిఫ్ట్‌ ఇదే.. ధనుష్‌ పోస్ట్‌ వైరల్!

భారత తుది జట్టు(అంచనా):
యశస్వీ జైస్వాల్, సంజు శాంసన్, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రియాన్ పరాగ్, రింకూ సింగ్, శివమ్ దూబె, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, మహ్మద్ సిరాజ్, ఖలీల్ అహ్మద్.

 

Exit mobile version