NTV Telugu Site icon

IND Playing 11 vs NZ: సూర్యకుమార్ ఔట్.. స్పెలిస్ట్ స్పిన్నర్ ఇన్! న్యూజిలాండ్‌పై బరిలోకి దిగే భారత తుది జట్టు ఇదే

Teami India

Teami India

India Playing 11 vs New Zealand for ODI World Cup 2023 1st Semi-Final: ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ 2023లో సెమీస్‌ పోరుకు రంగం సిద్ధమైంది. నవంబర్ 15న జరిగే తొలి సెమీస్‌లో న్యూజిలాండ్‌తో భారత్‌ ఢీ కొట్టనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు ఈ మ్యాచ్ ఆరంభం కానుంది. లీగ్ దశలో 9 మ్యాచ్‌లకు తొమ్మిది గెలిచిన భారత్.. అదే జోరును కివీస్‌పై కొనసాగించి గత ప్రపంచకప్‌లో ఎదురైన పరాభావానికి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటోంది. మరోవైపు భారత్‌ను ఓడించి ఫైనల్ చేరాలని కివీస్ భావిస్తోంది. రెండు పటిష్ట జట్ల మ్యాచ్ రసవత్తరంగా సాగనుంది. న్యూజిలాండ్‌తో సెమీస్‌ మ్యాచ్ నేపథ్యంలో భారత్ ప్లేయింగ్ 11ను ఓసారి చూద్దాం.

ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ అద్భుత ఆరంభాలు ఇస్తున్నారు. కీలక సెమీస్‌లో కూడా ఈ జోడి చెలరేగాలని మేనేజ్మెంట్ భావిస్తోంది. ముఖ్యంగా రోహిత్ జోరు కొనసాగిస్తే టీమిండియాకు తిరుగుండదు. విరాట్ కోహ్లీ అద్భుత ఫామ్ కనబర్చుతున్నాడు. ఇప్పటికే రెండు సెంచరీలు చేసిన కోహ్లీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ కూడా పరుగుల వరద పారిస్తున్నారు. టీమిండియా టాప్ ఆర్డర్ బలంగా ఉంది. ఏ ఇద్దరు చెలరేగినా కివీస్‌కు కష్టాలు తప్పవు.

బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ స్థానంలో స్పెలిస్ట్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తుది జట్టులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే.. కివీస్ బ్యాటర్లలో లెఫ్ట్ హ్యాండర్స్ ఎక్కువగా ఉండడం ఓ కారణం అయితే.. వాంఖడే స్టేడియం పిచ్ స్పిన్‌కు అనుకూలిస్తుందనే అంచనాలు మరో కారణం. అయితే అశ్విన్ జట్టులోకి వస్తే భారత్ బ్యాటింగ్ బలహీనం అవుతుంది. నాకౌట్ మ్యాచ్ కాబట్టి కెప్టెన్ రోహిత్ శర్మ ఏ నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.

భారత్ పేస్, స్పిన్ విభాగాలు పటిష్టంగా ఉన్నాయి. మహమ్మద్ షమీ, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజాలు వికెట్స్ తీస్తూ భారత్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. షమీ, కుల్దీప్, జడేజాలు ఓ ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్స్ పడగొట్టి ప్రత్యర్థులను హడలెత్తించారు. బుమ్రా, సిరాజ్ ఆరంభంలోనే వికెట్స్ తీస్తూ మంచి ఆరంభం అందిస్తున్నారు. అందరూ చెలరేగితే కివీస్ బ్యాటర్లను కట్టడి చేయడం కష్టమేమీ కాదు.

భారత తుది జట్టు (అంచనా):
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (కీపర్), సూర్యకుమార్ యాదవ్/రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, మహమ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్.

 

Show comments