ఆదివారం పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి వన్డేలో భారత్ ఓడిన విషయం తెలిసిందే. బ్యాటింగ్, బౌలింగ్‌లో తేలిపోయిన టీమిండియా ఘోర ఓటమిని ఖాతాలో వేసుకుంది. ఈ ఓటమితో మూడు వన్డేల సిరీస్‌లో భారత్ 0-1తో వెనకపడిపోయింది. సిరీస్‌లో నిలవాలంటే గురువారం అడిలైడ్‌లో జరగనున్న రెండో వన్డే మ్యాచ్‌లో టీమిండియా తప్పక గెలవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో తుది జట్టులో ఒకటి లేదా రెండు మార్పులు చేసే అవకాశముంది.
రెండో వన్డే మ్యాచ్‌లో ముఖ్యంగా బౌలింగ్‌లో మార్పులు చోటుచేసుకునే అవకాశముంది. పెర్త్ మ్యాచ్‌లో అవకాశం దక్కని మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ రెండో వన్డేలో ఆడనున్నాడని తెలుస్తోంది. అప్పుడు వాషింగ్టన్ సుందర్‌పై వేటు పడే అవకాశం ఉంది. మరోవైపు తెలుగు ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డిని తప్పించి.. కుల్దీప్‌ను జట్టులోకి తీసుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మొదటి మ్యాచ్‌లో నితీశ్ 11 బంతుల్లో 19 రన్స్ చేశాడు. ఈ నేపథ్యంలో నితీశ్ జట్టులో కొనసాగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. మరి టీమ్ మేనేజ్మెంట్ ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
Also Read: K Ramp : 2 రోజుల్లో 11.3 కోట్లు
మొదటి వన్డేలో బంతి, బ్యాట్‌తోనూ విఫలమైన హర్షిత్ రాణా అడిలైడ్‌లో ఆడడం డౌటే. అతడి స్థానంలో పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ ఆడనున్నాడని తెలుస్తోంది. ఈ రెండు మార్పులు మినహా మిగతా వారు కొనసాగనున్నారు. యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురేల్‌కు నిరాశ తప్పదు. సీనియర్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు పరుగులు చేయాల్సిన అవసరం ఉంది. శ్రేయస్ అయ్యర్ కీలక ఇన్నింగ్స్ బాకీ ఉన్నాడు. శుభ్‌మన్ గిల్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ సహా అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్ సత్తాచాటితే విజయం పక్కా.
