Hyderabad: గృహమే కదా స్వర్గసీమ అన్నారు పెద్దలు.. ఉద్యోగానికి వెళ్లినా.. ఇంకా ఏదైనా పనిపై వెళ్లినా.. మరేదైనా టూర్‌కు వెళ్లినా.. విహార, విజ్ఞాన యాత్రలు ఇలా ఎటూ తిరిగినా.. చిన్నదో.. పెద్దదో.. రేకులదో.. పూరి గుడిసె.. ఏదైనా సొంత గూటికి చేరితే ఉండే ప్రశాంతతే వేరుగా ఉంటుంది.. అయితే, మొదట ఇల్లు ఉంటే చాలు.. ఆ తర్వాత ఫ్యామిలీ అవసరాల కోసం ఓ పెద్దు ఇల్లు తీసుకుంటే ఎలా ఉంటుంది.. మనం అలాంటి ఇల్లు కొనుగోలు చేస్తే బాగుంటుందిగా.. ఇల్లు ఇలా కట్టుకుంటే అనుకూలంగా ఉంటుంది కదా? అనే రకరకాలుగా కలలు కనివారు ఉంటారు.. అయితే, విశ్వనగరంగా మారుతోన్న హైదరాబాద్‌లో జీవన ప్రమాణాలు మెరుగవుతున్నాయి. నివాస స్థాయిలు కూడా మారిపోతున్నాయి.. ఒకప్పుడు బస్తీలో ఉండే కుటుంబాలు.. ఇప్పుడు కాస్త మెరుగైన సౌకర్యాలున్న కాలనీలకు మారాలనే ప్రయత్నాలు చేస్తున్నాయి..
Read Also: TS Lawcet 2024: అలర్ట్… టీఎస్ లాసెట్ షెడ్యూల్ విడుదల.. జూన్ 3న ఎగ్జామ్
ఇదే సమయంలో.. కాలనీల్లో నివాసం ఉండేవారు గేటెడ్ కమ్యూనిటీల వైపు చూస్తున్నారు.. ఆర్థికంగా తమ వెసులుబాటు పెరుగుతున్న కొద్దీ అనుకూలమైన, అన్ని వసతులున్న ఇళ్ల కోసం ప్రయత్నిస్తున్నారట.. కొత్త ఇళ్ల కోసమే వెతకడం కాదు.. తమ అభిరుచికి అనుగుణంగా ఉన్న పాత ఇళ్లను సైతం చూస్తున్నారు.. కొనుగోలు చేస్తున్నారట.. దీంతో.. హైదరాబాద్‌లో పాత ఇళ్లకు ఫుల్ డిమాండ్ పెరిగిందని చెబుతున్నారు. ఉద్యోగం వచ్చినప్పుడో.. వ్యాపారంలో లాభాలు వచ్చినప్పుడు.. ఆర్థిక పరిస్థితిని బట్టి మొదట్లో ఎక్కువ మంది సింగిల్, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను తీసుకున్నవారు ఉంటారు.. అయితే, తమ పరిస్థితి ఇప్పుడు మరింత మెరుగు పడడంతో మూడు పడక గదుల ఇళ్లను కొనాలని ప్లాన్ చేస్తున్నారట.. ఈ నేపథ్యంలో పాత ఇళ్ల లభ్యత పెరిగింది. మరికొందరు 100 అడుగులు, 50 అడుగుల వెడల్పు రోడ్డులో ఉండే ఇళ్లు, అపార్టుమెంట్ శిథిలావస్థలో ఉన్నా.. వాటిని కొనుగోలు చేయడానికి మొగ్గుచూపుతున్నారట.. ఇప్పుడు కాకపోయినా.. ఆ స్థలాన్ని వాణిజ్యపరంగా వినియోగించుకుంటే లాభదాయకంగా ఉంటుందని.. కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు..
Read Also: Govinda Namalu: గమనసులోని కోరికలు నెరవేరాలంటే.. గోవిందనామాలు వినండి
దీంతో, కొత్తగా కడుతున్న అపార్టుమెంట్లతో దీటుగా పాత ఫ్లాట్స్ ధరలు పోటీ పడుతున్నాయని రియల్టర్లు చెబుతున్నారు.. కొత్త వాటితో పోల్చుకుంటే.. ఆ ప్రాంతాన్ని బట్టి ధరలు కొంచెం అటూఇటూగా ఉండడంతో పాతవాటి కొనుగోలుకే ప్రయత్నాలు సాగిస్తున్నారట.. పాతవి కొనేవారు కార్పస్ ఫండ్ చెల్లించాల్సిన అవసరం కూడా లేకపోవడం.. వాటికి కలిసే వచ్చే మరో అంశంగా ఉంది.. అలాగే కారు పార్కింగ్, ఇతర మెయిటనెన్స్ ఛార్జీలు కూడా కొత్త అపార్ట్‌మెంట్లకు చెల్లించాల్సిన మొత్తాలతో పోల్చుకుంటే.. పాతవాటిలో తక్కువగా ఉండడం కూడా మరో కారణం అంటున్నారు.. గేటెడ్ కమ్యూనిటీలో కొత్త ఫ్లాట్ రూ.కోటి పైన పలుకుతుంటే.. అదే పదేళ్లు దాటిన అపార్ట్‌మెంట్ రూ.70-75 లక్షల్లోపే వచ్చేస్తోందట.. దీంతో.. పాతవి కొనుగోలు చేసి.. ఇంటీరియర్ మార్చి, కొన్ని రిపేర్లు చేసుకుంటున్నారని చెబుతున్నారు. పాత కమ్యూనిటీల్లో కాస్త విశాలంగా రహదారులు, సౌకర్యాలు ఉండటంతో వెనక్కి తగ్గకుండా కొత్తవాటితో సమానంగా కొనుగోలు చేస్తున్నారని స్థిరాస్థి వ్యాపారులు చెబుతున్న గణాంకాలు.. అయితే, పాత ఇళ్లను, ఫ్లాట్స్‌ను కొనుగోలు చేసే ముందు.. వాటిని నిశితంగా పరిశీలించి.. తీసుకోవడం మంచిది అంటున్నారు నిర్మాణ రంగంలోని నిపుణులు.