Andhra Pradesh: స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో యూజర్ ఛార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. వేర్వేరు సేవలకు, డాక్యుమెంట్లకు యూజర్ ఛార్జీలను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.. మార్కెట్ విలువ సూచించే ధృవపత్రానికి యూజర్ ఛార్జీ రూ.10 నుంచి రూ.50కి పెంచగా.. ఈసీ జారీకి రూ. 10 నుంచి రూ. 100కి పెంచుతూ నిర్ణయం తీసుకుంది.. ప్రతి ఈసీ ధృవీకరణ పత్రానికి ఇక నుంచి రూ. 100 ఛార్జీ చేయనున్నారు.
Read Also: Off The Record: కేసీఆర్ ఊహించని నిర్ణయం..? గజ్వేల్ నుంచి పోటీ చేయట్లేదా..?
ఇక, సేల్ డీడ్‌లు బుక్, పవర్ ఆఫ్ ఆటార్నీలు, వీలునామా, గిఫ్ట్ డీడ్‌లు రిజిస్ట్రేషన్ చేసిన ప్రతీ డాక్యుమెంట్‌కూ ఇక నుంచి రూ.500 యూజర్ ఛార్జీ వసూలు చేయనున్నారు.. లక్షలోపు విలువ ఉన్న ఆస్తికి స్టాంపు ఫీజు ఇక నుంచి రూ.50కి పెంచారు.. లక్షదాటితే రూ.100 ఛార్జీ చేస్తారు.. వాణిజ్య సంస్థ, బైలా సొసైటీల రిజిస్ట్రేషన్ ధృవపత్రానికి రూ.100 యూజర్ ఛార్జీ వసూలుచేయాలని నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు.. పెంపు తక్షణం అమల్లోకి వస్తుందని ఉత్తర్వులు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ.