New Income Tax Rules: డిజిటల్ యుగంలో పన్ను ఎగవేతను అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతుంది. 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చే కొత్త ఆదాయపు పన్ను చట్టం కింద, ఆదాయపు పన్ను శాఖకు (Income Tax Department) సోషల్ మీడియా ఖాతాలు, వ్యక్తిగత ఈమెయిల్స్, ఇతర డిజిటల్ స్పేస్‌లను తనిఖీ చేసే అధికారం కల్పించనున్నారు. పన్ను ఎగవేత, దాచిన ఆదాయం లేదా ప్రకటించని ఆస్తులపై అనుమానం ఉన్నప్పుడు మాత్రమే ఈ అధికారాలు వినియోగించనున్నట్లు ప్రభుత్వం చెబుతోంది.
Pawan Kalyan: పదవి చిన్నదా..పెద్దదా కాదు బాధ్యతే గొప్పది.. జనసేన నేతలతో డిప్యూటీ సీఎం
ఇప్పటివరకు ఐటీ అధికారులు ప్రధానంగా భౌతిక ఆధారాలైన పత్రాలు, ఆస్తులు, లాకర్లు, బ్యాంకు ఖాతాల తనిఖీలకే పరిమితమయ్యేవారు. అయితే కొత్త చట్టం అమలులోకి వచ్చిన తర్వాత, డిజిటల్ ప్రపంచం కూడా ఐటీ సెర్చ్ పరిధిలోకి వస్తుంది. సోషల్ మీడియా ఖాతాలు, ఈమెయిల్ ఇన్‌బాక్స్‌లు, ఆన్‌లైన్ ఇన్వెస్ట్‌మెంట్ రికార్డులు, క్రిప్టో లావాదేవీలు, క్లౌడ్ సర్వర్లు వంటి వాటిని పరిశీలించే అధికారం ఐటీ అధికారులకు లభిస్తుంది.
ప్రభుత్వం చెబుతున్న కారణం స్పష్టంగా ఉంది. నేటి ఆర్థిక వ్యవస్థలో ఎక్కువ భాగం డిజిటల్ లావాదేవీలపై ఆధారపడుతోంది. ఆదాయం, పెట్టుబడులు, వ్యాపార లావాదేవీలు, సోషల్ మీడియా ద్వారా వచ్చే ఆదాయాలు అన్నీ ఆన్‌లైన్‌లోనే జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పన్ను ఎగవేతదారులను గుర్తించాలంటే డిజిటల్ ఆధారాలను పరిశీలించడం తప్పనిసరి అని ప్రభుత్వం భావిస్తోంది. ఈ అధికారాలు అందరికీ యథేచ్ఛగా వర్తించవని అధికారులు స్పష్టం చేస్తున్నారు. పన్ను ఎగవేతపై తగిన ఆధారాలతో కూడిన అనుమానం ఉన్నప్పుడు మాత్రమే డిజిటల్ ఖాతాల తనిఖీ జరుగుతుంది. ఇది సమూహ నిఘా (Mass Surveillance) కాదని, కేవలం లక్ష్యిత విచారణల కోసమేనని నిపుణులు చెబుతున్నారు.
Delhi High Court: పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టు విచారణ!
మరోవైపు సంపన్నులపై వారసత్వ పన్నుల అంశంపై కాంగ్రెస్ నేత శ్యామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలపై గతంలో బీజేపీ తీవ్రంగా విమర్శించింది. ఇప్పుడు అదే బీజేపీ ప్రభుత్వం పన్ను ఎగవేత పేరుతో ప్రజల వ్యక్తిగత గోప్యతలోకి చొరబడే చర్యలకు సిద్ధమవుతుందనే విమర్శలు ప్రతిపక్షాల నుంచి వినిపిస్తున్నాయి. సోషల్ మీడియా, ఈమెయిల్‌ల పర్యవేక్షణ గోప్యతకు ముప్పు కలిగిస్తుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇక మన దేశ జనాభా సుమారు 140 కోట్లు కాగా, 2024 నాటికి 8.62 కోట్ల మంది ఆదాయపు పన్ను చెల్లింపుదారులు ఉన్నారు. వీరిలో మహిళల వాటా సుమారు 15 శాతం. వ్యక్తిగత ఆదాయపు పన్ను వసూళ్లు కార్పొరేట్ పన్నులను మించాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్రానికి రూ.24 లక్షల కోట్లకు పైగా ఆదాయపు పన్ను ద్వారా వసూళ్లు వచ్చే అవకాశం ఉందని అంచనా. కోటి రూపాయలకుపైగా ఆదాయం ఉన్నవారు 2.16 లక్షల మందికి పైగా ఉన్నారు.
ఆదాయపు పన్ను చట్టం 2025లో మొత్తం 23 అధ్యాయాలు, 536 సెక్షన్లు మాత్రమే ఉండేలా సరళీకరణ చేశారు. అర్థంకాని నిబంధనలను తొలగించి, ఐటీ అధికారులకు మరింత ఎక్కువ అధికారాలు ఇచ్చారు. పాన్–బ్యాంకు ఖాతా లింకింగ్‌తో ఇప్పటికే లావాదేవీలపై పూర్తి సమాచారం అందుబాటులో ఉంది. దీనికి తోడు, ఏప్రిల్ 1, 2026 నుంచి అమల్లోకి వచ్చే డిజిటల్ ఖాతాల తనిఖీ ఐటీ శాఖకు మరింత బలమైన ఆయుధంగా మారనుంది.
