Site icon NTV Telugu

Income Tax Notice: లక్ష మందికి ఆదాయపు పన్ను శాఖ నోటీసులు.. కారణం ఇదే

Nirmala Sitharaman

Nirmala Sitharaman

Income Tax Notice: లక్ష మందికి పైగా పన్ను చెల్లింపుదారులకు ఆదాయపు పన్ను శాఖ నోటీసులు జారీ చేసినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం తెలియజేశారు. ఐటీఆర్ దాఖలు చేయకపోవడం, తప్పుడు ఆదాయ సమాచారం ఇవ్వడం వల్ల ఈ నోటీసు జారీ చేయబడింది. 50 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉన్న పన్ను చెల్లింపుదారులకు ఈ నోటీసులు పంపినట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి బకాయి ఉన్న పన్నులన్నీ క్లియర్ అవుతాయని ప్రభుత్వం భావిస్తోంది.

ఈ నోటీసుల పరిష్కారానికి ఐటీ శాఖ శరవేగంగా కసరత్తు చేస్తోందని ఆమె తెలిపారు. గత కొన్నేళ్లుగా ఆదాయపు పన్ను రేట్లు పెరగనప్పటికీ, ఆదాయపు పన్ను వసూళ్లను మాత్రం కచ్చితంగా పెంచామని చెప్పారు. దేశ ఆదాయపు పన్ను దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రసంగించారు. పన్ను చెల్లింపుదారులకు ఆదాయపు పన్ను శాఖ మొత్తం రెండు కేటగిరీల నోటీసులు పంపడం గమనార్హం. మొదటిది దాచిన ఆదాయం, తక్కువ పన్ను చెల్లించిన వ్యక్తులు…. రెండవది పన్ను పరిధిలోకి వచ్చినా బాధ్యతగా ITR దాఖలు చేయని వ్యక్తులు. ఏటా 50 లక్షల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం ఉన్నవారివే ఎక్కువ కేసులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కేసులన్నీ 4 నుండి 6 సంవత్సరాల వరకు ఉండవచ్చు.

Read Also:Malakpet MMTS: రెండు ఎంఎంటీఎస్ రైళ్లు ఎదురెదురు.. తరువాత ఏం జరిగిందంటే..!

ఆదాయపు పన్ను దినోత్సవం సందర్భంగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) చైర్మన్ మాట్లాడుతూ.. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి, ఇప్పటివరకు మొత్తం 4 కోట్ల మందికి పైగా పన్ను చెల్లింపుదారులు తమ ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేశారని చెప్పారు. ఇందులో సగం ప్రాసెస్ కూడా అయింది. 2022-23 ఆర్థిక సంవత్సరం, 2023-24 అసెస్‌మెంట్ సంవత్సరానికి ఐటీఆర్ ఫైల్ చేసే తేదీ దగ్గర పడుతుండటం గమనించదగ్గ విషయం. సమయానికి ITR ఫైల్ చేయాలని ఆదాయపు పన్ను శాఖ పదేపదే ప్రజలకు సలహా ఇస్తోంది. అలా చేయని పక్షంలో రూ.5 లక్షలకు పైబడి ఆదాయం ఉన్నవారు రూ.5వేలు, రూ.5 లక్షలలోపు ఆదాయం ఉన్నవారు రూ.1000 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. జరిమానా లేకుండా పన్ను డిపాజిట్ చేయడానికి జూలై 31 ఆఖరు తేది.

Read Also:Fracture Fixation: ఫ్రాక్చర్‌ ఫిక్సేషన్‌లో నూతన పద్ధతులు.. హైదరాబాద్‌లో వర్క్‌షాప్‌

Exit mobile version