NTV Telugu Site icon

Under 19 Asia Cup: జపాన్‌‭కు ఇచ్చిపడేసిన భారత్.. అమన్ అజేయ సెంచరీ

Ind Vs Jap Copy

Ind Vs Jap Copy

Under 19 Asia Cup Mohamed Amaan Century: యూఏఈ వేదికగా జరుగుతున్న అండర్-19 ఆసియా కప్ ఎనిమిదో మ్యాచ్‌లో భారత్, జపాన్‌తో తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసే అవకాశం వచ్చిన టీమిండియా పూర్తిగా సద్వినియోగం చేసుకుని భారీ స్కోరు చేసింది. భారత్ 50 ఓవర్లలో 339/6 స్కోరు చేసింది. ఈ సమయంలో కెప్టెన్ మహ్మద్ అమన్ అజేయ సెంచరీ సాధించాడు. ఇతడితో పాటు మరో ఇద్దరు ఆటగాళ్లు అర్ధ సెంచరీలు చేసారు. దింతో 340 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ జపాన్ కు అందించింది.

Also Read: Suman Kumar: హ్యాట్రిక్‭తోపాటు పది వికెట్లు తీసి సంచలనం సృష్టించిన సుమన్ కుమార్

ఈ మ్యాచ్‌లో జపాన్ టాస్ గెలిచి భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. తదనుగుణంగా ఆయుష్ మహాత్రే, వైభవ్ సూర్యవంశీ మరోసారి టీమ్ ఇండియాకు మంచి ఓపెనింగ్ పార్టనర్షిప్ ను అందించారు. పాకిస్థాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో శుభారంభం అందించడంలో విఫలమైన ఈ జోడీ జపాన్‌పై తొలి వికెట్‌కు 65 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. కానీ, వైభవ్ సూర్యవంశీ శుభారంభాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. పాకిస్థాన్‌పై ఒక్క పరుగుకే ఔటైన వైభవ్ సూర్యవంశీ జపాన్‌పై 23 పరుగులు చేశాడు.

Also Read: IPS officer: విషాదం.. పోస్టింగ్‌కి వెళ్తుండగా యువ ఐపీఎస్ అధికారి మృతి..

ఇక ఈ ఇన్నింగ్స్ లో ఆయుష్ మ్హత్రే 54 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఇక మూడో స్థానంలో వచ్చిన ఆండ్రీ సిద్ధార్థ్ 35 పరుగుల వద్ద పెవిలియన్ చేరగా, ఆ తర్వాత వచ్చిన కేపీ కార్తికేయ 49 బంతుల్లో 57 పరుగులు చేశాడు. ఓ దశలో భారత్ 46 ఓవర్లు ముగిసే సరికి 6 వికెట్ల నష్టానికి 289 పరుగులు చేసింది. అయితే, ఆ తర్వాత హార్దిక్ రాజ్, మహ్మద్ అమన్ చివరి 4 ఓవర్లలో 50 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. చివరగా.. మహ్మద్ అమన్ 118 బంతుల్లో 7 ఫోర్లతో అజేయంగా 122 పరుగులు చేయగా, హార్దిక్ రాజ్ 12 బంతుల్లో 25 పరుగులు చేశాడు. జపాన్‌ తరఫున కీఫర్‌ యమమోటో-లేక్‌, హ్యూగో కెల్లీ చెరో 2 వికెట్లు, ఆరవ్‌ తివారీ, చార్లెస్‌ హింజ్‌లు తలో వికెట్‌ తీశారు.