NTV Telugu Site icon

Tirumala: తిరుమలలో భారీగా భక్తుల రద్దీ.. వెంకన్న స్వామి దర్శనం కోసం ఏకంగా..?!

4

4

ప్రస్తుతం తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి తిరుమలలో భారీగా భక్తుల రద్దీ కొనసాగుతోంది. పిల్లలకు సెలవులు కావడంతో అలాగే పరీక్ష ఫలితాలు వస్తున్న నేపథ్యంలో తిరుమలకు భక్తుల రద్దీ మరింతగా పెరిగింది. వేసిన కాలం దృష్టిలో ఉంచుకొని తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు అనేక సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇకపోతే స్వామివారి దర్శించడానికి ఉచిత సర్వదర్శనానికి గాను అన్ని కంపార్ట్మెంట్లో నిండి బయటకి భక్తులు వేచి ఉన్నారు.

Also Read: AP Group 1 Results: గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల చేసిన ఏపీపీఎస్సీ..!

మరోవైపు టోకెన్ తీసుకొని భక్తులు సర్వదర్శనానికి ఏకంగా 18 గంటల సమయం పడుకున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలుపుతున్నారు. ఇకపోతే శుక్రవారం నాడు వెంకన్న స్వామిని 63,163 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 31,287 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించుకున్నారు.

Also Read: Memantha Siddham Bus Yatra: 14వ రోజుకు చేరిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర.. నేటి సీఎం జగన్‌ షెడ్యూల్‌ ఇదే..

ఇక మరోవైపు 300 రూపాయల ప్రత్యేక దర్శనానికి గాను భక్తులకు నాలుగు గంటల సమయం స్వామి వారి దర్శనానికి పడుతుంది. స్వామివారి దర్శనం కోసం టైం స్లాట్ ఎస్ఎస్డి దర్శనం కోసం 10 కంపార్ట్మెంట్లో భక్తులు వేచి ఉన్నారు. వీరందరికీ దాదాపు 5 గంటల సమయం పైనే స్వామి వారి దర్శనానికి సమయం పడుతుంది. శుక్రవారం నాడు స్వామి వారి హుండీ ఆదాయం 2.99 కోట్లుగా వచ్చినట్లు అధికారులు లెక్కలు తెలిపారు. తిరుమలలో భక్తులు రద్దీగా ఉండడంతో ఎవరైనా స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులు వేసవికాలం దృష్టిలో ఉంచుకొని తగు జాగ్రత్తలు తీసుకోవాలని టీటీడీ అధికారులు తెలిపారు. ముఖ్యంగా పిల్లలు, స్త్రీల విషయంలో భక్తులు జాగ్రత్తలు తీసుకోవాలని టీటీడీ కోరింది.