ఐపీఎల్ 2023 సీజన్ మ్యాచ్ లు ఒక ఎత్తు.. అదే ఫైనల్ మ్యాచ్ మరో ఎత్తు. ఎందుకంటారా.. ఫైనల్స్ కదా అందులోనూ చెన్నై, గుజరాత్ జట్ల మధ్య జరిగే హోరాహోరీ మ్యాచ్. అయితే ఐపీఎల్ టోర్నమెంట్ 74 మ్యాచ్ ల్లో 73 మ్యాచ్ లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా సాగింది. కానీ తీరా ఫైనల్ మ్యాచ్ మాత్రం మూడు రోజుల పాటు జరిగింది. అదేంటి ఒక్క మ్యాచ్ మూడు రోజులు ఎలా జరిగింది అని మీరు పరేషాన్ కాకండి. ఆదివారం(మే 28) సాయంత్రం 7.30 లకు ప్రారంభం కావాల్సిన మ్యాచ్.. ఆరోజు వర్షం కారణంగా తర్వాత రోజు( రిజర్వ్ డే )కు వాయిదా పడింది. మళ్లీ సోమవారం (మే 29) సాయంత్రం 7.30 లకు స్టార్ట్ కావాల్సిన మ్యాచ్.. టైంకే ప్రారంభమైనప్పటికీ.. గుజరాత్ బ్యాటింగ్ ముగిసి చెన్నై బ్యాటింగ్ చేస్తుండగా అరగంట సేపు వర్షం కురిసింది.
Also Read : Apollo Hospitals: దూసుకుపోయిన అపోలో హాస్పిటల్స్.. నాలుగో త్రైమాసికంలో లాభం ఎన్ని కోట్లంటే
ఇదంతా సరే.. ప్రపంచంలోకెల్లా సంపన్న క్రికెట్ బోర్డు అయిన బీసీసీఐ అహ్మదాబాద్‌లో ఐపీఎల్ ఫైనల్ నిర్వహించిన తీరు పట్ల నెటిజన్ల నుంచి విమర్శలొస్తున్నాయి. ఎందుకంటారా గ్రౌండ్ లో ఎక్కడా చూసిన వర్షపు నీరు, పిచ్ గ్రౌండ్ లో అక్కడక్కడా వాటర్ నిలిచిపోయింది. దీంతో మ్యాచ్ ప్రారంభమవుందా లేదా అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. కానీ అక్కడి గ్రౌండ్ సిబ్బంది మాత్రం గ్రౌండ్ ను ఆరబెట్టడానికి తీవ్రంగా శ్రమించారు. వాస్తవానికి అహ్మదాబాద్ స్టేడియాన్ని ఇటీవలే పునర్ నిర్మించారు. గ్రౌండ్ లో వర్షం పడితే ఎలాంటి ఇబ్బంది లేకుండా.. నీరు బయటకు వెళ్లేలా ఆధునిక డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు చెప్పిన మేనేజ్మెంట్.. సోమవారం రాత్రి అందుకు విరుద్ధమైన పరిస్థితి కనిపించింది.
Also Read : Khalistan: CBSC సిలబస్ నుంచి “సపరేట్ సిక్కు దేశం” పాఠ్యాంశం తొలగింపు
అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ గ్రౌండ్ లో వర్షపు నీరు ఎక్కువగా నిలవడంతో గ్రౌండ్ సిబ్బంది హెయిర్ డ్రయ్యర్లు, స్పాంజీలు ఉపయోగించారు. పేరుకేమో ప్రపంచంలోనే ధనిక క్రికెట్ బోర్డు.. కానీ పరిస్థితేమో ఇలా ఉంది అంటూ నెటిజన్లు బీసీసీఐపై విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు ఏటా వేల కోట్లు ఆర్జిస్తోన్న బీసీసీఐ మాత్రం స్పాంజిలను ఉపయోగించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. బీసీసీఐ కూడా ఆధునిక యంత్రాలను సమకూర్చుకోవాలని సూచిస్తున్నారు. బీసీసీఐకి అహ్మదాబాద్ స్టేడియం అంటే అంత ప్రేమ ఎందుకని మరికొందరు నెటిజన్స్ ప్రశ్నించారు.
Also Read : Telangana Police: తెలంగాణలో ఎస్ఐ, కానిస్టేబుల్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ రిలీజ్
మరోవైపు ఆదివారం వర్షం కారణంగా మ్యాచ్ మరుసటి రోజుకు వాయిదా పడింది. సోమవారం రాత్రి కూడా వర్షం పడుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాంటప్పుడు రిజర్వ్ డేన మ్యాచ్‌ను కొన్ని గంటలు ముందే ప్రారంభిస్తే తప్పేంటి..? అని నెటిజన్లు బీసీసీఐని ప్రశ్నిస్తున్నారు. కచ్చితంగా ఒకే సమయానికి మొదలుపెట్టాల్సిన అవసరం ఏముందంటున్నారు. మొత్తానికి బీసీసీఐపై విమర్శల వర్షం గుప్పిస్తున్నారు నెటిజన్లు. అంతేకాకుండా పీసీబీకి ఉన్న తెలివి కూడా లేదా అంటూ మండిపడుతున్నారు.
Also Read : Shocking : పడకగదిలో ప్రియుడితో తల్లికి అడ్డంగా బుక్కయిన కూతురు.. ఆ తర్వాత ఏమైందంటే
గతంలో.. పాకిస్థాన్ సూపర్ లీగ్ ఫైనల్ మార్చి 19న నిర్వహించాల్సి ఉండగా.. ఆరోజున వాతావరణం అనుకూలించదనే హెచ్చరికల నేపథ్యంలో పీసీబీ అప్రమత్తమైంది. ఫైనల్ మ్యాచ్ తేదీని ఒక రోజు ముందుకు జరిపింది. దీంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫైనల్ మ్యాజ్ సజావుగా సాగింది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకున్న అప్రమత్తత కూడా బీసీసీఐకి లేకపోతే ఎలా? అని కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అటు ఫైనల్ మ్యాచ్ పై క్రికెట్ అభిమానులతో పాటు నెటిజన్లు జోరుగా ట్రోల్ చేస్తున్నారు. ఒక్క టీ20ని మూడు రోజుల పాటు నిర్వహిస్తారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. వర్షం ఆటంకం కలిగించడంతో… ఆదివారం రాత్రికే ముగియాల్సిన మ్యాచ్ కాస్తా.. మూడు రోజులు సాగింది.