Site icon NTV Telugu

Anni Manchi Sakunale: సంక్రాంతి రేస్ లో ‘అన్నీ మంచి శకునములే!?

Anni Manchishakunale

Anni Manchishakunale

Anni Manchi Sakunale: టాలీవుడ్‌లో సంక్రాంతి 2023 రేస్ రోజురోజుకు ఆసక్తి కరంగా మారుతోంది. ఇప్పటికే తెలుగు బాక్సాఫీస్ వద్ద ‘వాల్తేర్ వీరయ్య, వీరసింహారెడ్డి, వారసుడు, తునివు’ సినిమాలు ఢీ కొట్టనున్నాయి. ఇదిలా ఉంటే ఈ సింహాల ఆటలోకి ఓ లేడీ కూడా దూరబోతోంది. అదే ‘అన్నీ మంచి శకునములే’. సంతోష్‌ శోభన్, మాళవిక నాయర్ తో నందిని రెడ్డి దర్శకత్వంలో స్వప్న సినిమా పతాకంపై ప్రియాంకదత్, స్వప్నాదత్ నిర్మించిన ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ విడుదల చేయబోతోంది. సంతోష్ శోభన్ ముందు సినిమా ‘లైక్ షేర్ సబ్‌స్క్రైబ్’ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయింది. అయినా స్వప్న సినిమాపై నమ్మకంతో యూవీ క్రియేషన్స్ సంక్రాతి రేస్ లోకి ఈ సినిమాను తీసుకు రానుంది. యువికి ట్రేడ్ లో ఉన్న పరపతితో ఈ సినిమాకు కూడా తగినన్ని థియేటర్లు లభించటం పెద్ద కష్టమేమీ కాదు. దీంతో ‘అన్నీ మంచి శకునములే’ కూడా ఇప్పుడు బడా రేస్ కి రెడీ అయింది. సో టాలీవుడ్ లో 2023 సంక్రాంతి రోజురోజుకు ఆసక్తికరంగా మారుతోందన్నమాట. చూడాలి ఏం జరుగుతుందో!

Exit mobile version