Gidugu Rudraraju: సీడబ్ల్యూసీ మీటింగ్‌లో ఏపీకి సంబంధించిన అంశాల ప్రస్తావన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gidugu Rudraraju: ఢిల్లీలో జరిగిన విస్తృత స్థాయి “కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ” (సీడబ్ల్యూసీ) సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీకి సంబంధించిన అంశాలను ప్రస్తావించారు. విభజన తర్వాత ఏపీలో అమలు కాని 10 కేంద్ర ప్రభుత్వ హామీలను గురించి తెలిపారు. ముఖ్యంగా స్పెషల్ కేటగిరీ స్టేటస్, పోలవరం ప్రాజెక్టు, దుగరాజపట్నం పోర్ట్, ఆర్థిక తోడ్పాటు హామీలను మోడీ ప్రభుత్వం విస్మరించిందని రుద్రరాజు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజల విశ్వాసాన్ని చూరగొనేందుకు ఏపీ
పార్టీ నేతలు, కార్యకర్తలు విపరూతంగా శ్రమిస్తున్నారని తెలిపారు.
Read Also: Dabur: రోజుకు 2.4 కోట్ల హజ్మోలా తింటున్న ఇండియన్స్.. రూ.కోట్లు సంపాదిస్తున్న డాబర్
Also Read
- Bengal Politics: బెంగాల్ ప్రతిపక్ష నేతగా రీటబ్రత.. మమత పార్టీలో కల్లోలం..
- El Nino-Centre: ఎల్‌నినోపై కేంద్రం అప్రమత్తం.. భయాందోళన అక్కర్లేదని హామీ
- Special TET: తెలంగాణ టీచర్లకు భారీ శుభవార్త.. ఇక నుంచి ప్రత్యేక టెట్.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విద్యాశాఖ..
- TMC Crisis: మమతకు భారీ షాక్.. 60 మంది ఎమ్మెల్యేల తిరుగుబాటు..!
గత అక్టోబర్ లో రాహుల్ గాంధీ నిర్వహించిన చారిత్రాత్మక “భారత్ జోడో” యాత్రకు ఏపీలో ప్రజల నుంచి బ్రహ్మాండమైన ప్రతిస్పందన లభించిందని గిడుగు రుద్రరాజు అన్నారు. ఈ నేపధ్యంలో సీనియర్ నాయకులు తరచూ ఏపీలో పర్యటించి, రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులను పునరుత్తేజం చేయాలని కోరారు. ఏపీలో మూడు భారీ బహిరంగ సభలు నిర్వహించాలని ప్రతిపాదించారు రుద్రరాజు. సాధ్యమైనంత త్వరగా ఏపీలో బహిరంగ సభల నిర్వహణకు సంబంధించి నిర్ణయం తీసుకోవాలని అభ్యర్ధించారు. విశాఖపట్నంలో రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో విశాఖ స్టీల్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఓ భారీ బహిరంగ సభను నిర్వహించాలని తెలిపారు. అంతేకాకుండా.. విజయవాడ-అమరావతిలో ప్రియాంక గాంధీ ఆధ్వర్యంలో బహిరంగ సభకు ప్రతిపాదన తెలిపారు. తిరుపతి లేదా అనంతపురంలో ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే అధ్యక్షతన బహిరంగ సభ నిర్వహించాలని సీడబ్ల్యూసీ సమావేశంలో తెలియజేశారు.
తాజావార్తలు
-
Bengal Politics: బెంగాల్ ప్రతిపక్ష నేతగా రీటబ్రత.. మమత పార్టీలో కల్లోలం..
-
El Nino-Centre: ఎల్‌నినోపై కేంద్రం అప్రమత్తం.. భయాందోళన అక్కర్లేదని హామీ
-
Special TET: తెలంగాణ టీచర్లకు భారీ శుభవార్త.. ఇక నుంచి ప్రత్యేక టెట్.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విద్యాశాఖ..
-
TMC Crisis: మమతకు భారీ షాక్.. 60 మంది ఎమ్మెల్యేల తిరుగుబాటు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!
ట్రెండింగ్
-
Chicken Keema Paratha Recipe: యమ్మీ.. యమ్మీ.. చికెన్ కీమా పరోటా.. సింపుల్‌గా ఇలా ఇంట్లోనే చేసుకోండి..!
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్‌తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!