NTV Telugu Site icon

Jobs In Telangana: తెలంగాణ వైద్య శాఖలో డాక్టర్ల నియామకాల కోసం నోటిఫికేషన్..

Jobs

Jobs

Jobs In Telangana: రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశాల మేరకు ఉస్మానియా, గాంధీ ఆసుపత్రి లలో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ల నియామకాల కాంట్రాక్ట్ ప్రాతిపాదిక పై తెలంగాణ వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలో మొత్తంగా 235 వివిధ స్థాయి డాక్టర్ల నియామకాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.

Ponguleti Srinivasa Reddy: పాలేరు మినీ హైడల్ ప్రాజెక్టు అధికారులపై ఆగ్రహించిన మంత్రి..

ఈ నోటిఫికేషన్ లో భాగంగా ఉస్మానియా ఆసుపత్రిలో ప్రొఫెసర్ లు – 8, అసోసియేట్ ప్రొఫెసర్ లు – 23, అసిస్టెంట్ ప్రొఫెసర్లు – 111, సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు – 33, మొత్తంగా 175 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇకమరోవైపు గాంధీ ఆసుపత్రిలో ప్రొఫెసర్లు – 3, అసిస్టెంట్ ప్రొఫెసర్లు – 29, సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు – 29, ట్యూటర్లు – 4, మొత్తంగా 60 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఉస్మానియా ఆసుపత్రి, గాంధీ ఆస్పత్రులలో మొత్తం. 235 పోస్టులకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఇక ఈ నియామకాల కోసం ముఖ్యమైన తేదీలు చుస్తే..

* నోటిఫికేషన్ విడుదల తేదీ: 6 ఆగస్టు 2024.
* ఇంటర్వ్యూ నిర్వహించే తేదీ: 9 ఆగస్టు 2024.
* ధ్రువపత్రాల పరిశీలన: 12 ఆగస్టు 2024.
* అభ్యంతరాలు: 13 ఆగస్టు 2024.
* ఎంపిక ప్రక్రియ: 14 ఆగస్టు 2024.

Harish Rao: గాల్లో దీపం లాగా ప్రభుత్వ పాలన ఉంది.. మాజీ మంత్రి..

ఈ నియామకాలను వాకింగ్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా పూర్తి చేయాలని ఉత్తర్వులలో వెల్లడించారు. 9 ఆగస్టు 2024 ఉదయం 10.30 గంటలకు గాంధీ మెడికల్ కాలేజ్ పరిపాలన భవనంలో డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ సమక్షంలో ఇంటర్వ్యూలు జరుగుతాయి. అలాగే 9 ఆగస్టు ఉదయం 10.30 గంటలకు ఉస్మానియా మెడికల్ కాలేజ్ అకాడమిక్ బ్లాక్ లో కమిషనర్, తెలంగాణ వైద్య విధాన పరిషత్ గారి సమక్షంలో ఇంటర్వ్యూలు జరుగుతాయి. ఈ నియామకాలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. మంత్రి ఆదేశాల మేరకు ఈ నియామకాలు పారదర్శకంగా జరిగేలా హైదరాబాద్ జిల్లా కలెక్టర్ / అదనపు కలెక్టర్ , మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్, తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ లు నోడల్ అధికారులుగా నియమిస్తూ ఉత్తర్వులను జారీ చేశారు.

Show comments