NTV Telugu Site icon

Hyderabad: బయటపడ్డ అధికారుల నిర్లక్ష్యం?.. భవనాలన్నీ పర్మిషన్ లేకుండా నిర్మించినవే..

Hyd News

Hyd News

కొండాపూర్ డివిజన్ సిద్దిక్ నగర్‌లో కుంగిన భవనం వెనుక టౌన్ ప్లానింగ్ అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. ప్రస్తుతం ఒరిగిన భవనంతో పాటు.. ఆ చుట్టూ ప్రక్కల ఉన్న భవనాలు అన్నింటినీ పర్మిషన్ లేకుండా నిర్మించినవే అని తేలింది. 50 నుంచి 100 గజాల లోపు ఉన్న చిన్న స్థలాల్లో 4, 5 అంతస్తుల నిర్మాణం చేపట్టారు భవన యజమానులు. నిర్మాణ సమయంలో ముడుపులు అందుకుని సైలెంట్ అయినట్లు తెలుస్తోంది. భవన యజమానులు ఒక్కో అంతస్తుకు అనుమతి తీసుకుని నాలుగు అంతస్తుల నిర్మాణం చేపట్టారు. ప్రస్తుతం ఒరిగిన భవనం సమీపంలో కూడా ఇదే తరహాలో నిర్మాణంలో ఉన్న మరి కొన్ని భవనాలు ఉన్నాయి. సంబంధిత అధికారులు.. ఈ అంశాలపై స్పందించడానికి మొహం చాటేస్తున్నారు. మరోవైపు మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో గచ్చిబౌలి జోనల్ మున్సిపల్ శాఖ అధికారులు ఫిర్యాదు చేశారు. సిద్ధిక్ నగర్ లో 150 గజాల స్థలంలో పిల్లర్లు తవ్విన యజమాని & బిల్దర్ పై మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. 50 గజాల స్థలంలో 5అంతస్తుల భవనం నిర్మించిన యజమానిపై పూర్తి దర్యాప్తు చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ శాఖ అధికారుల ఫిర్యాదులో పేర్కొన్నారు.

READ MORE: Errabelli Dayakar Rao: సీఎం రేవంత్ పై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు ఫైర్..

కాగా.. గచ్చిబౌలి.. మాదాపూర్ సిద్దిక్ నగర్ లో 5 అంతస్తుల భవనం ఓవైపునకు ఒరిగిన విషయం తెలిసిందే. ఈ భవనాన్ని కూల్చి వేసేందుకు రంగం సిద్ధమైంది. నిన్న రాత్రి 8:10 నిమిషాలకు పెద్ద శబ్దంతో 60 గజాల స్థలంలో ఒరిగింది. సరైన నిర్మాణ ప్రమాణాలు పాటించకుండా ఇంటి నిర్మాణ కోసం పక్కకే 150 గజాల స్థలంలో పిల్లర్ పూట్టింగ్ కోసం పెద్ద గుంత తవ్వడంతో ఈ భవనం కుంగినట్లు చెబుతున్నారు. కూల్చివేసేందుకు సిద్ధమైన భవనం 60 గజాల స్థలం ఉంది. హైడ్రాలిక్ యంత్రంతో మరికొద్ది సేపట్లో కూల్చి వేసేందుకు సిద్ధమవుతున్నారు హైడ్రా అధికారులు. కుంగిన భవనం చు పక్కల ఉన్న ఇళ్ళల్లోని నివాసితులకు ఖాళీ చేయించారు. జిహెచ్ఎంసి, డి ఆర్ఎఫ్ ట్రాఫిక్, విద్యుత్, అంబులెన్స్ & లా అండ్ ఆర్డర్ పోలీసులు ఘటనా స్థలంలో పరిస్థితులను పర్యవేక్షిస్తూ.. అప్రమత్తంగా ఉన్నారు.