NTV Telugu Site icon

Ganja Seized: సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్స్ వద్ద 10 కేజీల గంజాయి పట్టివేత..

Ganja

Ganja

సికింద్రాబాద్‌లో భారీగా గంజాయి పట్టివేత కలకలం రేపుతోంది. జింఖానా గ్రౌండ్స్ వద్ద 10 కేజీల గంజాయిని ఎక్సైజ్ STF అధికారులు సీజ్ చేశారు. పది కిలోల గంజాయిని పట్టుకున్నారు. అరకు నుంచి హైదరాబాద్‌కు కారులో తరలిస్తుండగా పట్టుకున్నారు. ఈ క్రమంలో.. గంజాయి తరలిస్తున్న ముగ్గురిపై కేసు నమోదు చేసి.. ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఈజీ మనీ వేటలో సాఫ్ట్వేర్ ఉద్యోగుల నుంచి కిందిస్థాయి ఉద్యోగుల వరకు గంజాయి అమ్మకాలు చేపడుతూ ఎక్సైజ్ పోలీసులకు పట్టుబడుతున్నారు. హెచ్ఎంటి కంపెనీలో ఉద్యోగం చేస్తూ వస్తున్న జీతంతో భార్యాబిడ్డలతో సంతోషంగా ఉండాలని భావించకుండా.. అక్రమార్గంలో గంజాయిని అమ్మకాలు చేపట్టి సొమ్ము చేసుకోవాలని భావించి STF ఎక్సైజ్ పోలీసులకు పట్టుబడ్డారు.

Read Also: Yadadri: పాఠశాల నుండి ఇంటికి ఆలస్యంగా వచ్చాడని కొడుకుని కొట్టి చంపిన తండ్రి..

హెచ్ఎంటీ కంపెనీలో ప్రవీణ్ వర్మ అనే వ్యక్తి ఉద్యోగం చేస్తున్నాడు. జూమ్‌లో కారు బుక్ చేసి.. కార్ అద్దెకు తీసుకొని ఏఓబీ ఆంధ్ర-ఒరిస్సా బార్డర్‌లోని అరకుకు కారులో వెళ్లాడు. అక్కడ పది కిలోల గంజాయిని కొనుగోలు చేసి కారులో హైదరాబాద్‌కు తిరిగి వస్తున్న క్రమంలో ప్రవీణ్ శర్మ దిగిపోయి మరో డ్రైవర్‌ను ఎక్కించాడు. కారు సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్స్ నుంచి అల్వాల్ వస్తున్న క్రమంలో ఎస్టిఎఫ్‌సి టీం సీఐ వెంకటేశ్వర్లు అతని బృందం కలిసి తనిఖీలు చేపడుతున్నారు. కాగా.. గంజాయి తరలిస్తున్న కారుపై అనుమానం వచ్చి కారును ఆపి తనిఖీలు చేపట్టారు.

Read Also: Jana Sena: జనసేన తిరుపతి ఇంఛార్జిపై మహిళ ఆరోపణలు.. పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం..

కారు డోరు అరల్లోను బానేట్లో గంజాయి ప్యాకెట్లను దాచి ఉంచి తీసుకు వస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కాగా.. వాటిని బయటకు తీసి తూకం వేయగా 10 కేజీల గంజాయి బయటపడింది. దీంతో.. గంజాయితో పాటు ఇద్దరు డ్రైవర్లను పోలీసులు అరెస్ట్ చేసి.. కారును స్వాధీనం చేసుకున్నారు. గంజాయి రవాణా చేసిన ప్రవీణ్ కుమార్ పరారీలో ఉన్నట్లు.. అతనిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పలుమార్లు ఇలాగే గంజాయిని తరలించి.. అల్వాల్, బోయిన్ పల్లి, మేడ్చల్ ప్రాంతాల్లో చిన్న చిన్న పాకెట్లుగా చేసి అమ్మకాలు చేపట్టి సొమ్ము చేసుకుంటున్నాడు. గంజాయిని పట్టుకున్న ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ టీమ్‌ను టెన్ ఫోర్ సిమెంట్ డైరెక్టర్ వివి కమలహాసన్ రెడ్డి, డీఎస్పీ భాస్కర్ అభినందించారు.