NTV Telugu Site icon

Chicken Biryani : బిర్యానీ ఆర్డర్ చేస్తే.. మంచూరియా ఇచ్చిన సిబ్బంది.. ఇదేమని అడుగుతే దంపతులపై దాడి..

Attack

Attack

Chicken Biryani : ఈ మధ్యకాలంలో చాలామంది హోటల్లు లేదా రెస్టారెంట్లలో తినేందుకు తెగ ఇష్టపడి పోతున్నారు. అయితే గత కొద్ది రోజుల నుండి బయట తినే ఆహారంలో నాణ్యత లోపించిందని అనేక సంఘటనలు సోషల్ మీడియా ద్వారా తెలుసుకుంటూనే ఉన్నాము. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మనం తినాల్సిన ఆహారాలను ఆర్డర్ చేయగా వాటితో పాటు తినకూడదని ఆహారాలు కూడా వస్తున్నాయి. బిర్యానీలో ప్లాస్టిక్ కవర్, చాక్లెట్ క్రీమ్ లో చనిపోయిన ఎలుక, ఐస్ క్రీంలో మనిషి బొటనవేలు ఇలా అనేక సంఘటనలు ఈ మధ్యకాలంలో మరీ ఎక్కువయ్యాయి. మరి కొన్ని సందర్భాలలో శాఖాహారం ఆర్డర్ చేస్తే మాంసాహారాలు డెలివరీ అయిన సంఘటనలు కూడా లేకపోలేదు. అందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక అసలు విషయంలోకి వెళితే..

Health Insurance Buying: ఆరోగ్య బీమా తీసుకోవాలనుకుంటున్నారా.. అయితే వీటి గురించి తెలుసుకోవాలిసిందే..

తాజాగా తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో ఉన్న చెర్రీ ఫ్యామిలీ రెస్టారెంట్ లో దంపతులపై సిబ్బంది దాడి చేశారు. చెర్రీ రెస్టారెంట్లో బిర్యాని తినేందుకు వచ్చారు దంపతులు. ఇందులో భాగంగా వారు చికెన్ పెప్పర్ బిర్యానీ ఆర్డర్ చేశారు. అయితే ఆర్డర్ చేసిన చికెన్ పెప్పర్ బిర్యాని ఇవ్వకుండా చికెన్ మంచూరియా ఇచ్చారు హోటల్ సిబ్బంది. అయితే ఈ విషయాన్ని హోటల్స్ సిబ్బందిని అడగగా.. వారు దంపతులపై ప్లేట్ తో దాడి చేశారు. దీంతో భర్త బుచ్చిబాబుకు స్వల్ప గాయాలయ్యాయి. అయితే ఈ విషయాన్ని పెద్దగా చేయడంతో.. అక్కడ అందరూ మాట్లాడి చివరకు హోటల్ సిబ్బందితో బుచ్చిబాబు కుటుంబానికి క్షమాపణలు చెప్పించారు.

Multivitamins: రోజూ మల్టీవిటమిన్లు తీసుకున్నంత మాత్రాన ఎక్కువ కాలం జీవించరు..

Show comments