Plane Accident: అమెరికా ఏరిజోనాలోని స్కాట్స్‌డేల్ ఎయిర్‌పోర్ట్‌లో రెండు ప్రైవేట్ జెట్ విమానాల ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరికొంత మంది గాయపడ్డారు. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) ప్రకారం, ల్యాండింగ్ సమయంలో ఒక ప్రైవేట్ జెట్ రన్‌వే నుంచి బయటకు వెళ్లి, ర్యాంప్‌పై నిలిపి ఉంచిన మరో గల్ఫ్‌స్ట్రీమ్ 200 జెట్‌ను ఢీకొంది. ఈ ప్రమాదం సోమవారం మధ్యాహ్నం 2:45 గంటలకు చోటు చేసుకుంది. లియర్‌జెట్ 35A విమానం ల్యాండింగ్ సమయంలో నియంత్రణ కోల్పోయి రన్‌వే దాటి ర్యాంప్‌పై ఉన్న గల్ఫ్‌స్ట్రీమ్ 200 బిజినెస్ జెట్‌ను ఢీకొట్టింది. ఈ ఘటన తరువాత స్కాట్స్‌డేల్ విమానాశ్రయంలో అన్ని విమానాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రైవేట్ జెట్‌లో ఎంత మంది ప్రయాణికులు ఉన్నారన్న వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Also Read: Delhi Elections: ఢిల్లీలో ఆప్ ఓటమిపై ప్రశాంత్ కిషోర్ పోస్టుమార్టం.. ఏం చెప్పారంటే..!
ఇది ఇలా ఉండగా, అమెరికా అలాస్కాలో మరో విమాన ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. అలాస్కాలోని నోమ్ నగరానికి వెళ్తున్న ఒక చిన్న ప్రయాణ విమానం అకస్మాత్తుగా అదృశ్యమైంది. అన్వేషణ కొనసాగిన తరువాత, ఆ విమానం సముద్రపు మంచుపై మంటకు ఆహుతైన స్థితిలో కనుగొనబడింది. ఈ విమాన ప్రమాదంలో 10 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. విమానంలో తొమ్మిది మంది ప్రయాణికులు, ఒక పైలట్ ఉండగా.. అందరూ మృతి చెందారు. ఈ ఘటనపై అమెరికా కోస్ట్ గార్డ్ ప్రతినిధి మైక్ సలెర్నో మాట్లాడుతూ, సముద్రపు మంచుపై విమాన శకలాలను రికవర్ చేసినట్లు తెలిపారు. రెండు రెస్క్యూ స్విమ్మర్లు శకలాలను పరిశీలించగా విమానంలో ఎవరూ ప్రాణాలతో లేనట్లు నిర్ధారించారు.