NTV Telugu Site icon

Marriage Viral: ఒకే కుటుంబంలోని ఆరుగురు అన్నదమ్ములను పెళ్లాడిన ఆరుగురు అక్కాచెల్లెళ్లు

Pakistan

Pakistan

Marriage Viral: పాకిస్థాన్ లోని పంజాబ్ లో ఓ వివాహానికి సంబంధించిన ఆసక్తికర ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది. అదేంటంటే.. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు సోదరులు, మరోవైపు ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు సోదరీమణులను సామూహిక వివాహ వేడుకలో వివాహం చేసుకున్నారు. ఈ వివాహం కేవలం 100 మందికి పైగా అతిథుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. ముఖ్యంగా ఖరీదైన సంప్రదాయాలను విడిచిపెట్టి సరళత వినయాన్ని ప్రోత్సహించింది. ఈ సంఘటన జరగడానికి సోదరులందరూ చాలా కాలం వేచి ఉండవలసి వచ్చింది. దీనికి కారణం వారిలో చిన్నవాడు ఇంకా పెళ్లి వయస్సుకు రాకపోవడమే.

Also Read: Pat Cummins: యాంకర్‌ ప్రపోజల్‌కు క్రేజీ ఆన్సర్ ఇచ్చిన ఆస్ట్రేలియా కెప్టెన్

ఇకపోతే ఈ వేడుకలో ఏ వరుడు కట్నం తీసుకోలేదు. అనవసరంగా కూడా ఖర్చు పెట్టలేదు. వరులు ఈ వివాహాన్ని ఒక ఉదాహరణగా మార్చాలని ఆలోచించడంతో ఇది సాధ్యమైంది. ఇస్లాం వివాహంలో సరళత, ఐక్యతను తెలుపుతుందని వారు చెప్పారు. ఇక ఆరుగురు అన్నదమ్ముల్లో పెద్దవాడు మాట్లాడూతూ.. పెళ్లి ఖర్చుల కోసం ప్రజలు తరచుగా తమ భూములను అమ్మడం లేదా అప్పులు చేయడం మనం చూశాము. కుటుంబంపై ఎలాంటి ఆర్థిక భారం పడకుండా పెళ్లిళ్లను సులువుగా, సంతోషకరమైన కార్యక్రమంగా నిర్వహించవచ్చని చూపించాలనుకున్నాం. ఈ కార్యక్రమం ఆరు జంటల సమ్మేళనానికి సంబంధించిన వేడుక మాత్రమే కాదు, అప్పుల భారం పడే వారికి మా పెళ్లిళ్లు ఒక స్ఫూర్తిదాయకంగా నిలవాలని తెలిపారు.

అంతే కాకుండా, వధువు కుటుంబం నుండి ఎలాంటి కట్నం తీసుకోలేదని సోదరులందరూ తమ నిర్ణయం తీసుకోవడంతో వారు ప్రజల దృష్టిని ఆకర్షించారు. సమాజంలో వేగంగా వ్యాపిస్తున్న వరకట్న ఆచారాన్ని అరికట్టేందుకు తాము తీసుకున్న నిర్ణయం ఒక ముఖ్యమైన ముందడుగు అని చెబుతున్నారు. వివాహానికి అసలు అర్థం ప్రేమ, ఐక్యత అని, ప్రదర్శన, ఖర్చు కాదని తెలిపారు. ఈ సామూహిక వివాహంలో కేవలం 1 లక్ష పాకిస్తానీ రూపాయలు మాత్రమే ఖర్చు చేయబడ్డాయి. అంటే భారత కరెన్సీలో చూస్తే ఈ మొత్తం రూ.30 వేలు మాత్రమే.

Show comments