NTV Telugu Site icon

NZ vs ENG: అబ్బా ఏం కిక్ ఉంది మామ.. సొంతగడ్డపై న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన ఇంగ్లాండ్

Nz Vs Eng

Nz Vs Eng

NZ vs ENG: గత నెలలో టీమిండియాను భారతదేశంలోనే క్లీన్ స్వీప్ చేసిన న్యూజిలాండ్ కు భారీ షాక్ తగిలింది. తాజాగా జరిగిన టెస్ట్ మ్యాచ్ లో న్యూజిలాండ్ ను వారి సొంత గడ్డపైనే ఇంగ్లాండ్ ను చిత్తు చేసింది. న్యూజిలాండ్ లో జరిగిన టెస్ట్ మ్యాచ్లో న్యూజిలాండ్, ఇంగ్లాండ్ తలపడ్డాయి. మూడు టెస్టుల సిరీస్ లో భాగంగా జరిగిన ఈ మొదటి టెస్టులో న్యూజిలాండ్ ఇంగ్లాండ్ ముందర తలవంచాల్సి వచ్చింది. ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ న్యూజిలాండ్ పై ఎనిమిది వికెట్ల భారీ విజయాన్ని అందుకుంది. ఈ టెస్ట్ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ మొదటి ఇన్నింగ్స్ లో 348 పరుగులతో ఆలౌట్ కాగా.. దానికి దీటుగా ఇంగ్లాండ్ జట్టు 499 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది. ఆ తర్వాత భారీ తేడాతో న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్ ని మొదలుపెట్టగా 254 పరుగులకే కుప్పకూలింది. దాంతో ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ లో స్వల్ప లక్ష్యాన్ని రెండు వికెట్లు కోల్పోయి ఎనిమిది వికెట్లతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.

Also Read: ICC WTC Points Table: డ్యామిట్ కథ అడ్డం తిరిగేలా ఉందే.. శ్రీలంకను ఓడించి ఆస్ట్రేలియాకు దెబ్బేసిన దక్షిణాఫ్రికా

ఈ టెస్ట్ మ్యాచ్ విజయంతో న్యూజిలాండ్ నాలుగో స్థానానికి పడిపోగా.. ప్రస్తుతం 54.5 పర్సంటేజ్ తో టెస్ట్ ప్రపంచ ఛాంపియన్షిప్ కు దూరం అయినట్లుగా కనబడుతోంది. మరోవైపు ఇంగ్లాండ్ 40.79 పర్సంటేజ్ తో ఆరో స్థానంలో కొనసాగుతోంది. న్యూజిలాండ్ ఓటమితో ఆస్ట్రేలియా, ఇండియాలకు కాస్త మేలు జరిగినట్లు అయింది. చూడాలి మరి మరో రెండు టెస్టు మ్యాచ్ లు ఉండడంతో ఫలితం ఎలా ఉండబోతుందో. ప్రస్తుతానికైతే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ లో భాగంగా ఇండియా మొదటి స్థానంలో కొనసాగుతుండగా.. సౌత్ ఆఫ్రికా రెండో స్థానంలో ఉంది. ఆ తర్వాత ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, శ్రీలంక తర్వాత స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మధ్య జరిగిన టెస్టులో బ్రైడన్ కార్సే 10 వికెట్లు తీసి న్యూజిలాండ్ పతనాన్ని శాసించాడు. దాంతో అతడు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్నాడు.