NTV Telugu Site icon

Cashew Rs.30 Per KG: జీడిపప్పు కిలో 30 రూపాయలు మాత్రమే..!

New Project (9)

New Project (9)

Cashew Rs.30 Per KG: సాధారణంగా జీడిపప్పు రోజూ తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి. ఆరోగ్యకరమైన గుండె, బలమైన నరాల ,కండరాల పనితీరు దీనిని తినడం వల్ల కలిగే ముఖ్య ప్రయోజనాలు. అయితే జీడిపప్పు, బాదంపప్పు, పిస్తా ఇవన్నీ.. సామాన్యులు కొనలేని రిచ్‌ ఫుడ్స్‌.. వీటి ధరకు తగ్గట్లే వీటిలో పోషకాలు రిచ్‌గానే ఉంటాయి. కేజీ కొనాలంటే.. క్వాలిటీని బట్టి.. కనీసం రూ. వెయ్యి అయినా పెట్టాల్సిందే. అయితే మన దేశంలోనే ఒక ప్రాంతంలో మాత్రం కేవలం రూ.30కే జీడిపప్పు దొరుకుతుంది. నమ్మలేకపోయినా అది నిజం. ఇంతకీ అది ఎక్కడ ఉందో తెలుసుకుందాం.

జార్ఖండ్లోని జంతార జిల్లాలోని నాలా అనే గ్రామంలో జీడిపప్పును అత్యంత తక్కువ ధరకు దొరుకుతుంది. అందుకే దీన్ని ‘జార్ఖండ్ జీడిపప్పు నగరంగా పిలుస్తారు. ఈ గ్రామానికి వెళ్తే కిలో జీడిపప్పు కేవలం రూ.20 నుంచి 30లకే లభిస్తుంది. మామూలుగా చెప్పాలంటే కూరగాయల కంటే ఛీపే.. అందుకే ఎక్కడెక్కడి నుంచో వచ్చిన ప్రజలు నాలా గ్రామంలోనే జీడిపప్పును కొని తీసుకు వెళ్తూ ఉంటారు. ఇక్కడ నుంచే దళారులు అధికంగా కొని బయట ప్రాంతాల్లో వంద రెట్లు అధిక ధరకు అమ్ముతారు.

Read Also: Apcc Deeksha:మోడీ హయాంలో సీబీఐ, ఈడీలు కీలుబొమ్మలు

అసలు ఎందుకింత తక్కువ
నాలా గ్రామంలో 50 ఎకరాల విస్తీర్ణంలో జీడి తోటలనే వేశారు. 2010లో నాలా గ్రామంలోని వాతావరణం, నేలలు జీడిపప్పు సాగుకు అనుకూలంగా ఉంటాయని అటవీ శాఖ గుర్తించింది. అంతేకాదు గ్రామస్తులు అందరికీ ఈ విషయాన్ని చెప్పి జీడి తోటను పెంచే విధంగా చేసింది. అలా ఒకేసారి గ్రామం అంతా పెద్ద ఎత్తున జీడి సాగు మొదలుపెట్టారు. ఇందుకోసం అప్పట్లో ఐఏఎస్ కృపానంద ఝా ఎంతో కష్టపడ్డారు. ఆయన జంతారా జిల్లా డిప్యూటీ కమిషనర్‌గా ఉన్నప్పుడు ఈ నాలా గ్రామం విశిష్టతను వాతావరణ పరిస్థితులను అర్థం చేసుకుని పరిశోధకులతో చర్చించి అక్కడ నేలలు, నీటిని పరీక్షించేలా చేశారు.

Read Also: Rahul Gandhi: దటీజ్ రాహుల్.. డిస్ క్వాలిఫైడ్ ఎంపీ అంటూ ట్విట్టర్ అకౌంట్‌లో మార్పు

అలా, అటవీశాఖ చొరవ తీసుకొని ఆ గ్రామంలో జీడి తోటలను పెంచేలా చేశారు. అయితే ఇంతగా జీడిపప్పు పండడం వల్ల అక్కడ రైతులకు మాత్రం ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. అంతా వచ్చి తక్కువ ధరకే జీడిపప్పును కొని పట్టుకెళ్తున్నారు. అది కూడా రోడ్డు పక్కన పెట్టి అమ్ముతుండడం వల్ల కిలో 30 నుంచి 50 రూపాయలకే అమ్మాల్సి వస్తోంది. అక్కడ ప్రాసెసింగ్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తే రైతులకు మరింత ఉపాధి అవకాశాలతో పాటు, జీడిపప్పు ధర కూడా పెరిగే అవకాశం ఉంది.

Show comments