Crime: రానురాను మానవ సంబంధాలు దారుణంగా తయారవుతున్నాయి. మనీ మానవ బంధాలను మార్చేస్తోంది. డబ్బు వ్యామోహంలో పడి మనిషి క్రూరంగా మారిపోతున్నాడు. డబ్బులకోసం కుటుంబ సభ్యులనే కాటికి చేర్చుతున్న ఘటనలు కోకొల్లలు. తాజాగా ఇలాంటి ఘటనే.. ముజఫర్ నగర్లో చోటు చేసుకుంది. అను కుమారి (30) అనే మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. స్థానికులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ కేసు అహియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆదర్శ్ విలేజ్ రోడ్ నంబర్ 1కి సంబంధించినది. ఘటనా స్థలానికి చేరుకున్న తల్లిదండ్రులు అను కుమారికి భర్త సూచనల మేరకే ఆమె సవతి కుమారులు విషమిచ్చి చంపారని ఆరోపించారు. విషయం తెలుసుకున్న అనూ కుమారి పేరెంట్స్ అహియాపూర్ పోలీస్ స్టేషన్ పోలీసులకు సమాచారం అందించారు.
Read Also: Rs.425crore worth Drugs seized : ఇరాన్ బోటు నుంచి రూ.425కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం
అనూ కుమారి స్పృహతప్పి పడిపోయింది. స్థానికులు ఆమెను జురాన్ ఛప్రాలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ కేసులో వాంగ్మూలాన్ని నమోదు చేసినట్లు బ్రహ్మపుర పోలీసులు తెలిపారు. అల్లుడు ఆర్మీ నుంచి రిటైర్ అయ్యాడని మృతుడి తల్లి రీటా దేవి తెలిపారు. ప్రస్తుతం శివహర్‌లోని డయల్ 112లో పని చేస్తున్నారు. అల్లుడి మొదటి భార్య చనిపోయింది. ఆమెకు కూడా విషం ఇచ్చి హత్య చేసినట్లు ఆరోపించింది. ఐదేళ్ల క్రితం అను రెండో పెళ్లి చేసుకుంది. పెళ్లి సమయంలో రూ.3 లక్షల విలువైన నగలు, ఫర్నీచర్ వస్తువులు ఇచ్చినట్లు చెప్పింది. ఆ తర్వాత కూతురిని కూడా మరిన్ని డబ్బులు తేవాలని హింసించేవాడని పేర్కొంది.
Read Also:Gay Partner : వ్యాపారి.. పార్టనర్.. మధ్య కుదరని ఆ సంబంధం.. సుత్తితో కొట్టి దారుణంగా..
రీటా దేవి అల్లుడికి మొదటి భార్య ద్వారా ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇద్దరూ మైనర్లే. అందరూ కలిసి తన కూతురిని హింసించే వారని చెప్పుకొచ్చింది. రాత్రి కొడుకులిద్దరూ మాంసం చేసి అనూకు తినిపించారు. తరువాత, ఆమె స్నానం చేయడానికి వెళ్లింది. కొంతసేపటికి స్థానికులు ఫోన్ చేసి అను స్పృహ తప్పి పడిపోయిందని చెప్పారు. హాస్పిటల్ కి తీసుకెళ్లారు. నిందితుడు తండ్రి ఆదేశానుసారం సవతి కొడుకులిద్దరూ తన ఆహారంలో విషం కలిపారని రీటా దేవి తెలిపారు. ప్రస్తుతం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత మృతికి గల కారణాలు తెలియనున్నాయి.
