Upcoming Smart Phones: మరో 30 రోజుల్లో 2024 సంవత్సరం ముగియబోతోంది. ఇకపోతే, ఈ సంవత్సరం ముగిసేలోపు స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లు తమ జనాదరణ పొందిన అనేక ఉత్పత్తులను పరిచయం చేయడానికి రెడీ ఐపోయాయి. డిసెంబర్ నెలలో చాలా స్మార్ట్‌ఫోన్‌లు బడా బ్రాండ్స్ నుండి విడుదల కానున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లు భారత మార్కెట్లో పెను సంచలనాలను సృష్టించగలవని కంపెనీలు భావిస్తున్నాయి. ఎందుకంటే, శక్తివంతమైన ఫీచర్లు ఇంకా ఆకర్షణీయమైన ధరల అద్భుతమైన కలయికతో రాబోతున్నాయి. మరి ఆ మొబైల్స్ ఏంటో ఒకసారి చూద్దామా..
Also Read: Drunk and Drive: వీరంగం సృష్టించిన మందుబాబు.. పోలీసులతో వాగ్వాదం
iQOO 13 వచ్చే ఈ నెలలోనే లాంచ్ కానుంది. ఈ స్మార్ట్‌ఫోన్ లాంచ్‌కు సంబంధించిన అన్ని వివరాలను కంపెనీ షేర్ చేయడం మొదలు పెట్టింది. ఈ ఫోన్‌ను చైనాలో విడుదల చేసినప్పటికీ, భరత్ లో మాత్రం డిసెంబర్ 3న లాంచ్ చేయబోతుంది. కంపెనీ దీనిని iQOO 12 అప్డేట్ వర్షన్ గా రిలీజ్ చేయబోతుంది. ఈ ఫోన్ లో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, స్టైలిష్ అల్యూమినియం ఫ్రేమ్, గ్లాసీ ప్యానెల్, IP69 రేటింగ్ ఇంకా అనేక ఆకర్షణీయమైన ఫీచర్లను పొందుతారు. స్మార్ట్‌ఫోన్ వెనుక ప్యానెల్ RGB LED లైట్‌లతో వస్తుంది. ఇది దాని డిజైన్‌ను మరింత మెరుగ్గా చేస్తుంది.
ఇక మరో మొబైల్ రెడ్‌మి నోట్ 14 సిరీస్ భారతదేశంలో లాంచ్ కానుంది. కంపెనీ ఈ సిరీస్‌ని డిసెంబర్ 9న భారత్ మార్కెట్ లోకి తీసుక రాబోతుంది. ఈ సిరీస్ లో మొత్తం మూడు స్మార్ట్‌ఫోన్‌లు ఉంటాయి. నోట్ 14, నోట్ 14 ప్రో, నోట్ 14 ప్రో+ మొబైల్స్ రానున్నాయి. ఈ మొబైల్స్ 6.67-అంగుళాల OLED డిస్‌ప్లేతో వస్తాయి. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇస్తుంది. MediaTek Dimensity 7300-Ultra ప్రాసెసర్ Redmi Note 14 Proలో అందుబాటులో ఉంటుంది. నోట్ 14లో MediaTek Dimensity 7025-అల్ట్రా, నోట్ 14 ప్రో+లో స్నాప్‌డ్రాగన్ 7s Gen 3 ప్రాసెసర్‌లు ఉంటాయి.
Also Read: Husband Murdered By Wife: ట్రెండ్ మారింది.. ఆస్తి కోసం భర్తను 30 ముక్కలుగా నరికిన భార్య
ఇవే కాకుండా, డిసెంబర్ నెలలోనే Vivo నుండి Vivo X200 సిరీస్‌ను చూడబోతున్నాము. ఈ సిరీస్‌లో కంపెనీ Vivo X200, Vivo X200 PROలను లాంచ్ చేస్తుంది. ఈ సిరీస్ 200MP టెలిఫోటో కెమెరా లెన్స్‌తో వస్తుంది. అయితే కంపెనీ ఇంకా లాంచ్ తేదీని ప్రకటించలేదు. అయితే ఈ ఫోన్‌లను డిసెంబర్loనే లాంచ్ చేయవచ్చని సమాచారం. ఇక మరోవైపు, OnePlus 13 కంపెనీ దీనిని డిసెంబర్ చివరిలో లేదా జనవరి 2025లో ప్రారంభించవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ చైనాలో ఇప్పటికే హల్చల్ చేస్తోంది. ఇది 6.82-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 Elite ప్రాసెసర్, 6000mAh బ్యాటరీ ఇంకా 100W ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది.