NTV Telugu Site icon

Gun On Road: నడిరోడ్డుపై తుపాకీతో వ్యక్తిని కొట్టిన ఆ పార్టీ నాయకుడు.. వీడియో వైరల్..

Gun On Road

Gun On Road

నేడు సోషల్ మీడియాలో ఓ షాకింగ్ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో పట్టపగలు రద్దీగా ఉండే రోడ్డుపై చేతిలో తుపాకీతో ఒక వ్యక్తి మరో వ్యక్తిపై దాడి చేయడం కనిపించింది. 11 సెకన్ల ఈ వీడియోలో, రద్దీగా ఉండే రహదారి మధ్యలో ఆ వ్యక్తి మరొక వ్యక్తిని పిస్టల్ బట్‌ తో కొట్టి, ఇతరులతో పాటు రచ్చ సృష్టించినట్లు చూడవచ్చు. అలాగే వాహనాల నుంచి హారన్‌ ల బీప్‌ సౌండ్స్ కూడా వినిపిస్తోంది.

T20 World Cup 2024 Semifinals: సెమీఫైనల్ చేరుకొనే ఆ 4 టీమ్స్ ఇవే..

లక్నోలో ఒక యువకుడిని బహిరంగంగా పిస్టల్‌తో కొట్టిన వ్యక్తి జాతీయ షూటర్, సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు వినోద్ మిశ్రా అని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లోని వినియోగదారులు పేర్కొన్నారు. వారణాసిలో జరిగిన జాతీయ క్రీడల సందర్భంగా వీడియోలో కనిపిస్తున్న పిస్టల్‌ పనిచేయకపోవడం గమనార్హం. ఇక పోలీసుల నివేదికల ప్రకారం, రోడ్డు పైనే ఈ సంఘటన జరిగింది. అక్కడున్న SUV వాహనం జాతీయ షూటర్, సమాజ్ వాదీ పార్టీ నాయకుడు వినోద్ మిశ్రాకు చెందినది. లక్నోలోని విభూతిఖండ్ ప్రాంతంలో రోడ్డుపై ఈ ఘటన చోటుచేసుకుంది. వీడియో వైరల్ కావడంతో., నిందితుడు ఎస్పీకి నాయకుడిపై కంప్లైంట్ చేయగా., పోలీసులు ఆ షూటర్ ను అరెస్టు చేసి తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు.

Team India Head Coach: టీమిండియా హెడ్ కోచ్గా గౌతం గంభీర్..?

Show comments