NTV Telugu Site icon

Extramarital Affair: మరిదితో వదిన రాసలీలలు.. భర్తకు తెలియడంతో ఏం చేసిందంటే?

Crime News

Crime News

Extramarital Affair: ‘కామా తురాణం నభయం నలజ్జ’ అని ఎవరు చెప్పారో తెలీదు గానీ ప్రస్తుతం సమాజంలో జరిగే ఘటనలు చూస్తుంటే అది నూటికి నూరుపాళ్లు నిజమే అనిపిస్తోంది. కామంతో కళ్లుమూసుకుపోతున్న కొందరు వావివరుసలు, కుటుంబ కట్టుబాట్లు మరిచి కామాంధులుగా మారుతున్నారు. ఎవరేమైనా కానీ తమ శారీరక వాంఛలు తీరితే చాలు అన్నట్లు ఆడా, మగా కామంతో రెచ్చిపోతున్నారు. ఈ కోవలోనే వదినపై కన్నేసిన ఓ యువకుడు ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. అన్న కళ్లుగప్పి వీలు చిక్కినప్పుడల్లా ఆమెతో కామకలాపాల్లో మునిగి తేలుతున్నాడు. వదిన అంటే తల్లితో సమానం అంటారు.. మరిదిని కన్న బిడ్డలా చూసుకోవాలి.. కానీ ఆమె మాత్రం మరిదిపై మోజు పడింది. వయసులో తనకన్నా చాలా చిన్నవాడైనా అతడంటే ఇష్టం పెంచుకుంది. మంచి యవ్వనంలో ఉండడం.. నిత్యం నవ్వుతూ చురుగ్గా ఉండడంతో అతడితో బాగా క్లోజ్ అయ్యింది. తనను అస్సలు పట్టించుకోకపోవడంతో భర్తకు అనుమానం వచ్చి నిఘా పెడితే అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఇది భర్తకు తెలియడమే అతని ప్రాణానికి ముప్పుగా మారింది.

Also Read: MP Family Kidnap: వైజాగ్ ఎంపీ ఫ్యామిలీ కిడ్నాప్‌ కేసు.. కీలక విషయాలు వెల్లడించిన డీజీపీ

తన అక్రమ సంబంధానికి ఎక్కడ అడ్డొస్తాడోనని అతడిని ప్రియుడి సాయంతో చంపేసి శవాన్ని మరుగుదొడ్డి గుంతలో పూడ్చిపెట్టేసింది. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌ జిల్లాలో వెలుగుచూసింది. ఆషియా అనే మహిళ తన భర్త తమ్ముడు సుహైల్‌తో అక్రమ సంబంధం పెట్టుకుందని పోలీసుల విచారణలో తేలింది. గురువారం ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. బాధితుడు సాగర్‌ అనే వ్యక్తి జూన్‌ 6న అదృశ్యమయ్యాడు. కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ విచారణలో సుహైల్‌తో తనకున్న అనుబంధం గురించి సాగర్‌కు తెలియడంతో ఆషియా హత్యకు ప్లాన్ చేసిందని పోలీసులు తెలిపారు. ఆ మహిళ తన భర్తను హత్య చేసిన తర్వాత రోజుల తరబడి అదే ఇంట్లో నివసిస్తుండగా, జూన్ 9న అతని మృతదేహాన్ని బయటకు తీశారు. ఆ తర్వాత పోలీసులు అతని మృతదేహాన్ని సెప్టిక్ ట్యాంక్‌లో కనుగొన్నారు. విచారణలో పోలీసులు నిందితులిద్దరినీ అదుపులోకి తీసుకుని విచారించగా ఇద్దరు నేరం అంగీకరించారు.

“తన ప్రేమికుడు సుహైల్ సహాయంతో తన భర్తను హత్య చేసి, మృతదేహాన్ని సెప్టిక్ ట్యాంక్‌లో పడవేసినట్లు ఆషియా అంగీకరించింది” అని పోలీసు అధికారి జ్ఞానేశ్వర్ బోధ్ తెలిపారు. “జూన్ 6న సాగర్‌గా గుర్తించబడిన వ్యక్తి కనిపించకుండా పోయాడని మాకు సమాచారం అందింది. సుహైల్‌తో కలిసి తన భర్తను గొంతుకోసి చంపి సెప్టిక్‌ ట్యాంక్‌లో పాతిపెట్టినట్లు ఆషియా అంగీకరించింది” అని ఎస్పీ (నగరం), సత్యన్నారాయణ ప్రజాపత్ అన్నారు. “హత్య చేసినట్లు ఇద్దరూ అంగీకరించిన తర్వాత, మేజిస్ట్రేట్‌ను పిలిపించి, స్పాట్‌ను తవ్వి, మృతదేహాన్ని వెలికితీశారు. మేము మృతదేహాన్ని పోస్ట్‌మార్టం పరీక్షకు పంపాము” అని పోలీసులు తెలిపారు.