ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్న లోక్ సభ ఎన్నికల్లో అనేకచోట్ల కొందరు నటులు పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ లిస్ట్ లో తెలంగాణ రాష్ట్రంలో కూడా మరో తెలుగు నటి లోక్ సభ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసింది. తెలుగులో విడుదలైన పొలిమేర సిరీస్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి దాసరి సాహితి నేడు నామినేషన్ దాఖలు చేసింది.
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గం నుండి సాహితి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయబోతోంది. ఈ నేపథ్యంలో బుధవారం నాడు నామినేషన్ దాఖలు చేసింది. జిల్లా కలెక్టర్, ఎలక్షన్ రిటర్నింగ్ అధికారి శశాంక్ కు నామినేషన్ ను ఆవిడ సమర్పించింది. పొలిమేర, పొలిమేర 2 సినిమాలలో సాహితి తన నటనలతో ఆకట్టుకుంది. పొలిమేర సిరీస్ లో మొదటి భాగంలో గెటప్ శీను భార్యగా, పొలిమేర 2 సీరిస్ లో రాజేష్ తో కలిసి నటించింది.
ఈ మధ్యకాలంలో ఆవిడ తన ఇంస్టాగ్రామ్ వేదికగా రాజకీయాల గురించి స్పందించింది. తాను జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు పెద్ద అభిమానిని తెలిపింది. ఇదివరకు తన పోస్టులలో రీల్స్ చూసి పాటలకు పొలిటికల్ విషయాలని జత చేర్చవద్దని ఆవిడ కోరింది. ఇకపోతే ప్రస్తుతం చేవెళ్ల లోక్సభ నియోజకవర్గం గాను కాంగ్రెస్ పార్టీ నుండి రంజిత్ రెడ్డి, బిజెపి పార్టీ తరపు నుండి కొండ విశ్వేశ్వర్ రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ నుండి కాసాని జ్ఞానేశ్వర్ బరిలో ఉన్నారు. చూడాలి మరి ఈ తెలుగు నటి ఎన్నికల్లో ఎంతవరకు ప్రభావం చూపగలదో.