NTV Telugu Site icon

Khammam: యువతను మత్తుకు బానిసల్ని చేస్తున్న అక్రమార్కులు.. మీ పిల్లలు జాగ్రత్తా?

Ganja

Ganja

గంజాయి మత్తులో యువత జోగుతుంది. విచ్చలవిడిగా లభిస్తున్న మత్తుకు బానిసలుగా మారుతున్నారు. యదేచ్ఛగా యువత గంజాయి తీసుకుంటున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. పగలు రాత్రి అనే తేడా లేకుండా గంజాయి వినియోగిస్తుండటంతో మైనర్లు సైతం దీనికి బానిసలు అవుతున్నారు. గంజాయి మత్తులో జీవితం నాసనం చేసుకుంటున్నారు. మీ పిల్లలు కూడా ఈ జాబితాలో ఉంటే ఇప్పుడే జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఇదిలా ఉండగా.. తాజాగా ఖమ్మం జిల్లాలో గంజాయి గ్యాంప్ పోలీసులకు పట్టుబడింది.

READ MORE: BJP: “సీఎం సిద్ధరామయ్యకు మెంటల్ ట్రీట్మెంట్ అవసరం”.. ఉగ్రవాది వ్యాఖ్యలపై కేంద్రమంత్రి ఫైర్..

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలోని పలు గ్రామాల్లో గంజాయి సేవిస్తున్న యువకులను పోలీసులు పట్టుకొని స్టేషన్ కు తరలించారు. పెనుబల్లి మండలంలోని బీసీ కాలనీ, రంగారావు బంజర్, గంగాదేవిపాడు గ్రామాలతో‌ పాటు పలు గ్రామాల్లో అడ్డగా గంజా విక్రయాలు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. గంజాయి ఎలా లభిస్తుంది ఇంకా ఎంత మంది యువత సేవిస్తున్నారు.. అనే చైన్ లింక్ ను ఛేదించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఓ యువకుడు బైక్ లో 300 గ్రాముల గంజా దొరికిది. దీంతో అప్రమత్తమైన పోలీసలు చైన్ లింక్ లాగుతూ విచారణ చేస్తున్న చేస్తున్నారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో పలువురు యువకులు ఉన్నారు.

READ MORE: Crime: నకిలీ వితంతు సర్టిఫికెట్లతో గవర్నమెంట్ జాబ్ కొట్టేసిన అక్కాచెల్లెళ్లు..

Show comments