NTV Telugu Site icon

Earth Quake : జమ్మూ కాశ్మీర్‌లో భూకంపం.. పరుగులు పెట్టిన ప్రజలు..

Earth Quake

Earth Quake

Earth Quake in Jammu Kashmir: జమ్మూకశ్మీర్‌లో నేడు భూకంపం సంభవించింది. కాశ్మీర్‌ లోని బారాముల్లాలో ఈరోజు మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై 4.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. ప్రకంపనలు రావడంతో స్థానికుల్లో భయాందోళన నెలకొంది. దింతో వారు రోడ్లపైకి పరుగులు తీశారు. ఇకపోతే, ఈరోజు మధ్యాహ్నం 12:25 గంటల ప్రాంతంలో సంభవించిన భూకంపం తర్వాత బారాముల్లాలో ప్రజలలో గందరగోళం నెలకొంది. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. భూకంపం తీవ్రత ఎక్కువగా ఉండడంతో మార్కెట్‌ లో బిజీగా ఉన్న ప్రజలు, దుకాణదారులు ఒక్కసారిగా సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. అయితే సమాచారం మేరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు.

Uttarpradesh : ఇప్పటికే ఏడు సార్లు…. తొమ్మిదోసారి కాటేస్తే చనిపోతావని కలలో పాము చెప్పిందన్న యువకుడు

సమాచారం ప్రకారం, భూకంపం ప్రకంపనలు సంభవించిన వెంటనే మార్కెట్లలో భయాందోళనలు నెలకొన్నాయి. దుకాణదారులు తమ దుకాణాల నుంచి బయటకు వచ్చి రోడ్డుపైకి వచ్చారు. దాంతో అక్కడ చాలాసేపు భయాందోళన వాతావరణం కొనసాగింది. అయితే అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. ఇక ఇందుకు సంబంధించిన విశేషాలను అక్కడి ప్రజలు సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు.

Nepal : నేపాల్‌ ప్రమాదంలో ఏడుగురు భారతీయులు మృతి, 50 మంది గల్లంతు