NTV Telugu Site icon

Iran Israel War: విజయం దగ్గర్లోనే ఉంది.. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ!

Iran Israel War

Iran Israel War

Iran Israel War: ఇజ్రాయెల్‌పై క్షిపణి దాడి తర్వాత, ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ సోషల్ మీడియాలో అనేక పోస్ట్‌లు చేశారు. ఖమేనీ బుధవారం తన సోషల్ మీడియా ‘X’ ఖాతా ద్వారా ఒక చిత్రాన్ని పంచుకున్నారు. దీనిలో చాలా క్షిపణులు ఉంది అందులో కొన్ని క్షిపణులు ప్రయోగించబడుతున్నాయి. ఏ ఫోటోను షేర్ చేస్తూ.. ‘చింతించకండి, దేవుని సహాయం త్వరలో వస్తుంది. విజయం దగ్గర పడింది అని రాసుకొచ్చారు. ఈ పోస్ట్ తర్వాత ‘దేవుని సహాయంతో, జియోనిస్ట్ పాలనపై మా దాడులు మరింత బలపడతాయని ఖమేనీ మరో ట్వీట్‌ చేసారు. మంగళవారం రాత్రి ఇరాన్ ఇజ్రాయెల్‌పై దాదాపు 200 క్షిపణులను ప్రయోగించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఇజ్రాయెల్ కూడా ఎదురుదాడి ప్రకటించింది.

ఈ నేపథ్యంలో ఇరాన్‌ నుంచి ఇజ్రాయెల్‌పై దాడి జరుగుతోందని భారత్‌లోని ఇజ్రాయెల్‌ రాయబారి రూవెన్‌ అజార్‌ తెలిపారు. X లో ఒక పోస్ట్‌ ద్వారా, ‘ఇజ్రాయెల్ ఇరాన్ నుండి దాడికి గురవుతోంది. ఇజ్రాయెల్ గెలుస్తుంది. ఇరాన్ ఛాందసవాద మారణహోమం ఘోరమైన తప్పు చేసింది. ఇరాన్ పెద్ద ఎత్తున దాడికి సంబంధించి, ఇరాన్ దాడి తీవ్రమైన, ప్రమాదకరమైన తీవ్రతరం పరిణామాలు ఉంటాయని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ప్రతినిధి రియర్ అడ్మిరల్ డేనియల్ హగారి పేర్కొన్నారు.

180కి పైగా బాలిస్టిక్ క్షిపణులతో ఇరాన్ నేరుగా ఇజ్రాయెల్‌పై భారీ దాడి చేసింది. కొన్ని క్షిపణులను మధ్య ఇజ్రాయెల్‌లోకి, కొన్ని క్షిపణులను దక్షిణ ఇజ్రాయెల్‌లోకి ప్రయోగించారు. జరిగిన ఇరాన్ దాడి తీవ్రమైన, ప్రమాదకరమైన దాడి. దీనికి పరిణామాలు ఉంటాయి. ఈ దాడులపై ఎప్పుడు, ఎలా కావాలంటే అప్పుడు స్పందిస్తామని హగారి తెలిపారు.

Show comments