NTV Telugu Site icon

IPL 2025 Mega Auction: ఐపీఎల్ 2025 వేలంలో అత్యధిక ధర పలికిన టాప్ 10 ఆటగాళ్లు ఎవరంటే

Kkr

Kkr

IPL 2025 Mega Auction: ఐపీఎల్ 2025 కోసం ఆటగాళ్ల వేలం ఆది, సోమవారాల్లో జెడ్డాలో జరుగుతోంది. మొదటి రోజు మొత్తం 72 మంది ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఇందులో భారత జట్టు స్టార్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ ఐపీఎల్‌లో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. పంత్‌ను రూ.27 కోట్లకు లక్నో సూపర్ జెయింట్స్ కొనుగోలు చేయగా, ఈ ఏడాది కోల్‌కతా నైట్ రైడర్స్‌ను టైటిల్‌కు తీసుకెళ్లిన కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ రూ.26 కోట్ల 75 లక్షలకు పంజాబ్ కింగ్స్‌లో చేరాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధికంగా అమ్ముడైన రెండో ఆటగాడిగా నిలిచాడు. అయ్యర్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ మధ్య చాలా సేపు పోటీ జరిగింది. కానీ, చివరికి పంజాబ్ గెలిచింది. ఐపీఎల్ 2025 వేలంలో మొదటి బిడ్ అర్ష్‌దీప్ సింగ్‌పై జరిగింది. అతడిని కొనుగోలు చేసేందుకు 6 ఫ్రాంచైజీలు వేలం వేసాయి. హైదరాబాద్ అత్యధికంగా రూ.18 కోట్లకు బిడ్ చేసినప్పటికీ, పంజాబ్ కింగ్స్ రైట్ టు మ్యాచ్ (ఆర్‌టీఎం)ని ఉపయోగించి అతడిని రూ.18 కోట్లకు తమ జట్టులోకి చేర్చుకుంది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన స్పిన్నర్‌గా యుజ్వేంద్ర చాహల్ నిలిచాడు. పంజాబ్ అతడిని రూ.18 కోట్లకు కొనుగోలు చేసింది. మార్క్యూ ప్లేయర్ల జాబితాలో ఏడుగురు భారత ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజీలు రూ.126 కోట్లు వెచ్చించింది. ఇకపోతే ఆదివారం జరిగిన వేలంలో అత్యధికంగా ధర పలికిన టాప్ 10 ఆటగాళ్ల లిస్ట్ ఇలా ఉంది.

Also Read: Rashmika Mandanna: అదేంటి రష్మిక పెళ్లి గురించి అలా అనేసింది!

1. రిషబ్ పంత్ – లక్నో సూపర్ జెయింట్స్ – రూ.27 కోట్లు
2. శ్రేయాస్ అయ్యర్ – పంజాబ్ కింగ్స్ – రూ.26.5కోట్లు
3. వెంకటేష్ అయ్యర్ – కోల్‌కతా నైట్ రైడర్స్ – రూ. 23.75 కోట్లు
4. అర్ష్‌దీప్ సింగ్ – పంజాబ్ కింగ్స్ (RTM) – రూ.18కోట్లు
5. యుజ్వేంద్ర చాహల్ – పంజాబ్ కింగ్స్ – రూ.18కోట్లు
6. జోస్ బట్లర్ – గుజరాత్ టైటాన్స్ – రూ.15.75కోట్లు
7. కేఎల్ రాహుల్ – ఢిల్లీ క్యాపిటల్స్ – రూ.14కోట్లు
8. మహ్మద్ సిరాజ్ – గుజరాత్ టైటాన్స్ – రూ. రూ.12.25కోట్లు
9. మిచెల్ స్టార్క్ – ఢిల్లీ క్యాపిటల్స్ – రూ.11.75కోట్లు.
10. ఇషాన్ కిషన్ – సన్‌రైజర్స్ హైదరాబాద్ – రూ.11.25 కోట్లు.

Also Read: IPL 2025 Auction: తొలిరోజు వేలం త‌ర్వాత 10 జ‌ట్ల వ‌ద్ద మిగిలిన ప‌ర్సు విలువ‌లు..