Site icon NTV Telugu

SRH IPL 2025 Players List: వేలంలో ఎస్ఆర్‌హెచ్‌ కొనుగోలు చేసిన ఆటగాళ్లు వీరే

Srh

Srh

SRH IPL 2025 Players List: ఐపీఎల్ 2025 కోసం నిర్వహించిన మెగా వేలం కోసం అన్ని జట్లు ఆటగాళ్ల కోసం భారీగా వేలం వేసి చాలా డబ్బు ఖర్చు చేశాయి. ప్రతి జట్టు 25 మంది ఆటగాళ్ల కోటాను పూర్తి చేయడానికి ప్రయత్నించింది. గత ఐపీఎల్ సీజన్ ఫైనలిస్ట్ సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా ఐపీఎల్ వేలంలో భారీ కొనుగోళ్లు చేసి తన కొత్త జట్టును సిద్ధం చేసింది. ఐపీఎల్ 2025 మెగా వేలం మొదటి రోజున సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ జట్టులో మొహమ్మద్ షమీ, హర్షల్ పటేల్, ఇషాన్ కిషన్, రాహుల్ చాహర్, ఆడమ్ జంపా, అథర్వ తైదే, అభినవ్ మనోహర్, సిమర్‌జీత్ సింగ్‌లతో సహా మొత్తం 8 మంది ఆటగాళ్లను చేర్చుకుంది. హైదరాబాద్ జట్టులో నలుగురు విదేశీయులు సహా మొత్తం 13 మంది ఆటగాళ్లు ఉన్నారు. ఈ నేపథ్యంలో వేలం రెండవ రోజు 4 విదేశీయులతో సహా మొత్తం 12 మంది ఆటగాళ్లను 5.15 కోట్ల రూపాయలకు కొనుగోలు చేయాల్సి ఉంది. రెండో రోజు అత్యంత తక్కువ మనీ పర్సుతో హైదరాబాద్ వేలంలోకి అడుగుపెట్టనుంది. ఇకపోతే , రిటైన్ చేయబడిన ఆటగాళ్లతో పాటు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఏ ఆటగాళ్లను కొనుగోలు చేసింది. వారిని ఇంతకు కొనుగోలు చేసిందో ఒకసారి చూద్దాం.

Also Read: IPL Auction 2025: మొదటి రోజు అమ్ముడైన ప్లేయర్స్ లిస్ట్ ఇదే!

ఐపీఎల్ వేలానికి ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ రిటైన్డ్ ప్లేయర్స్ లిస్ట్:

* హెన్రిచ్ క్లాసెన్ (దక్షిణాఫ్రికా) – రూ.23 కోట్లు
* పాట్ కమిన్స్ (ఆస్ట్రేలియా) – రూ.18 కోట్లు
* ట్రావిస్ హెడ్ (ఆస్ట్రేలియా) – రూ.14 కోట్లు
* అభిషేక్ శర్మ (భారత్) – రూ.14 కోట్లు
* నితీష్ కుమార్ రెడ్డి (భారత్) – రూ. 6 కోట్లు

Also Read: Allu Arjun: క్షమించమని కోరుకుంటున్నా.. ఈ నేలకు ధన్యవాదాలు!

IPL 2025 వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసిన ఆటగాళ్లు:

* మహ్మద్ షమీ (భారత్) – రూ.10 కోట్లు
* హర్షల్ పటేల్ (భారత్) – రూ.8 కోట్లు
* ఇషాన్ కిషన్ (భారత్) – రూ.11.25 కోట్లు
* రాహుల్ చాహర్ (భారత్) – రూ.03.20 కోట్లు
* ఆడమ్ జంపా (ఆస్ట్రేలియా) – రూ.2.40 కోట్లు
* అథర్వ తైడే (భారత్) – రూ.30 లక్షలు
* అభినవ్ మనోహర్ (భారత్) – రూ.3.2 కోట్లు
* సిమర్జిత్ సింగ్ (భారత్)- రూ.1.5 కోట్లు.

Exit mobile version