NTV Telugu Site icon

Adilabad: ఇంద్రవెల్లి లో ఆదివాసీ అస్తిత్వ పోరు గర్జన సభ.. డిమాండ్లు ఇవే..

Indravelli

Indravelli

నేడు ఆదిలాబాద్‌లోని ఇంద్రవెల్లి లో ఆదివాసీ అస్తిత్వ పోరు గర్జన సభ నిర్వహిస్తున్నారు. తుడుం దెబ్బ రాయి సెంటర్ ఆధ్వర్యంలో సభకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆదివాసి చట్టాల అమలు, హక్కులు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ సభ నిర్వహిస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారత రాజ్యాంగంలో పొందుపరిచిన ఆదివాసి చట్టాలు హక్కులు జీవోలు అన్నీ కూడా కాలరాస్తున్నాయని తుడుం దెబ్బ రాష్ట్ర కమిటీ ఆరోపించింది. ఆదివాసీల సంస్కృతి సాంప్రదాయాలు, వారిపై దాడులను తిప్పికొడుతూ తమ అస్తిత్వాన్ని కాపాడుకునే సందర్భంగా ఇవ్వాళ గ్రామ గ్రామాన జెండాలు ఎగుర వేయాలని పిలుపునిచ్చింది. ఆదివాసి అస్తిత్వ పోరు గర్జన సభకు హాజరై విజయవంతం చేయగలరని విజ్ఞప్తి చేసింది.

READ MORE: High Court: వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌కు హైకోర్టులో చుక్కెదురు..

ఆదివాసి అస్తిత్వ పోరు గర్జన సభ డిమాండ్లు..
1. చట్టబద్ధత లేని లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలి.
2. గత రాష్ట్ర ప్రభుత్వం 11, కులాలను ఎస్టీ జాబితాలో కలుపుతూ చేసిన అసెంబ్లీ తీర్మానాన్ని రద్దు చేయాలి.
3. ఐదవ షెడ్యూల్ ప్రాంతంలో 100% విద్య, ఉద్యోగ, వైద్య, ఉపాధి అవకాశాలు ఆదివాసులకే కల్పించాలి.
4. ఏజెన్సీ ప్రాంతాల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో 100% రిజర్వేషన్స్ ఆదివాసీలకే కేటాయించాలి.
5. ఆదివాసులు సాగు చేసుకుంటున్నా పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలి.
6. జై నూర్ సంఘటనతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆదివాసులపై పెట్టిన ఆక్రమ కేసులను ఎత్తివేయాలి.
7. మెస్రం నీలాబాయికి నీలాబాయి కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలి.
8. ఐదవ షెడ్యూల్ ప్రాంతంలో స్పెషల్ డీఎస్సీ నోటిఫికేషన్ వేసి ఆదివాసి యువతీ యువకుల చేతనే ఉద్యోగ నియామకాలు చేపట్టాలి.
9. పిసా చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలి.
10. జిల్లా, మండల కేంద్రాల్లో ప్రభుత్వ భూములలో గుడిసెలు వేసుకొని నివసిస్తున్న ఆదివాసీలకు ఇంటి స్థలాలకు పట్టాలు మంజూరు చేయాలి. వారికి ఉచిత నీరు, కరెంటు, విద్య, వైద్య సౌకర్యాలు కల్పించాలి.
11. ఎలాంటి షరతులు లేకుండా రైతు రుణమాఫీ, రైతు భరోసా అమలు చేయాలి.
12. ఐదవ షెడ్యూల్ ప్రాంతంలో GONO, 317ను రద్దు చేయాలి.
13. నాన్ ఏజెన్సీ గ్రామాలను ఏజెన్సీ గ్రామాలుగా గుర్తించాలి.