IND vs AUS Test match Day 4: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ వేదికగా జరుగుతున్న భారత్, ఆస్ట్రేలియా టెస్ట్ మ్యాచ్ లో భారత్ విజయం వైపుకు దూసుకెళ్తోంది. మూడో రోజు రెండో ఇన్నింగ్స్ లో మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన ఆస్ట్రేలియను కాపాడేందుకు ట్రావిస్ హెడ్ ఒంటరి పోరాటం చేస్తున్నాడు. మూడోరోజు ఆటో ముసే సమయానికి ఆస్ట్రేలియా 12 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇక నాలుగో రోజు ఆట మొదలుపెట్టిన వెంటనే మరో ఐదు పరుగులు జోడించగానే ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ ఉస్మాన్ క్వాజా హైదరాబాద్ బౌలర్ సిరాజ్ బౌలింగ్ లో వెనుతిరిగాడు.
Also Read: IPL 2025 Mega Auction: ఐపీఎల్ 2025 వేలంలో అత్యధిక ధర పలికిన టాప్ 10 ఆటగాళ్లు ఎవరంటే
అలాగే ఆస్ట్రేలియా స్కోర్ 79 పరుగుల వద్ద మరోసారి మహమ్మద్ సిరాజ్ ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్మెన్ స్టీవెన్ స్మిత్ ను 17 పరుగుల వద్ద పెవీలియన్ కు పంపాడు. ఇకపోతే, నాలుగో రోజు లంచ్ విరామానికి గాను ఆస్ట్రేలియా జట్టు 5 వికెట్లు కోల్పోయి 104 పరుగులను చేసింది. ట్రావిస్ హెడ్ 63 పరుగులు, మిచెల్ మార్ష్ ఐదు పరుగులతో క్రీజులో ఉన్నారు. మరోవైపు, టీమిండియా ఐదు వికెట్లు నేల కూల్చితే విజయాన్ని అందుకుంటుంది. ఆస్ట్రేలియా విజయం సాధించాలంటే ఇంకా 430 పరుగులు జోడించాల్సి ఉంది. ఇక టీమ్ ఇండియా బౌలర్లలో కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా రెండు వికెట్లు తీయగా, హైదరాబాద్ స్టార్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ మూడు వికెట్లు తీశాడు.
Also Read: IPL 2025 Auction: తొలిరోజు వేలం తర్వాత 10 జట్ల వద్ద మిగిలిన పర్సు విలువలు..