Haryana Elections 2024: హర్యానా ప్రజలు ఇప్పటి వరకు వరుసగా మూడోసారి ఎవరికీ పట్టం కట్టిన చరిత్ర లేదు.. గరిష్టంగా రెండుసార్లే ఒక పార్టీకి అధికారం అప్పజెప్పారు. 1968,72లో, 2005,09లో కాంగ్రెస్ ను గెలిపించగా.. 2014, 19లో బీజేపీకి అధికారం అందించారు.. ఈసారి హర్యానాలో హ్యాట్రిక్ కొట్టాలని బీజేపీ ప్లాన్ చేసింది . కానీ అందుకు విరుద్ధంగా ఎగ్జిట్ ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ నేపథ్యంలోనే నేడు మొదలైన ఓట్ల లెక్కింపులో కూడా ఆ మార్క్ స్పష్టంగా కనపడుతోంది.
ప్రస్తుతం హర్యానాలో మొదలైన ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ దూసుకెళ్తుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కాంగ్రెస్ 54 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, 22 స్థానాల్లో మాత్రమే బీజేపీ ముందంజలో ఉంది. దింతో బీజేపీకి ఎదురుదెబ్బ తగులుతున్నట్లు కనిపిస్తోంది. కౌంటింగ్ సాగుతున్న కొద్దీ ఫలితాలు స్పష్టంగా కనిపించడం జరుగుతుంది. హర్యానాలో బీజేపీ వరుసగా మూడోసారి అధికారాన్ని నిలబెట్టుకోగలదన్న నమ్మకంతో ఉంది. అదే సమయంలో కాంగ్రెస్ కూడా పదేళ్ల తర్వాత మళ్లీ అధికారంలోకి రావాలని భావిస్తోంది. కౌంటింగ్ ప్రక్రియకు భద్రతా ఏర్పాట్లతో పాటు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతా ఏర్పాట్లు చేశారు.